తెలంగాణలో మరో 1,433 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. ఉత్తర్వులు ఇచ్చిన ఆర్థిక శాఖ

Telangana Finance Ministry Gives Green Signal For The Recruitment of 1433 Posts in Municipal Panchayat Raj Dept, Finance Ministry Gives Green Signal For The Recruitment of 1433 Posts in Municipal Panchayat Raj Dept, Green Signal For The Recruitment of 1433 Posts in Municipal Panchayat Raj Dept, Recruitment of 1433 Posts in Municipal Panchayat Raj Dept, Telangana approves to fill up 1433 vacancies Panchayat Raj Dept, Panchayat Raj Dept, Telangana Financial Department, Finance Ministry has given the green signal to fill the vacancies in the Municipal and Panchayati Raj Dept, 1433 Posts in Municipal Panchayat Raj Dept, Panchayat Raj department, Telangana Finance Ministry News, Telangana Finance Ministry Latest News, Telangana Finance Ministry Latest Updates, Telangana Finance Ministry Live Updates, Mango News, Mango News Telugu,

తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు మరో శుభవార్త అందించింది. తాజాగా మున్సిపల్, పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్ డిపార్ట్‌మెంట్‌లో ఖాళీల భర్తీకి ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ రెండు శాఖల్లో కలిపి మొత్తం 1433 పోస్టులను భర్తీ చేయటానికి ఆమోదం తెలిపింది. ఇందులో రూరల్‌ వాటర్‌ సప్లైలో చీఫ్ ఇంజనీర్ పోస్టులు 420 కాగా, జనరల్ అండ్ పంచాయతీ డిపార్ట్‌మెంట్‌లో మరో చీఫ్ ఇంజనీర్ 350 పోస్టులు ఉన్నాయి. అలాగే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ హెచ్ఓడీ 196, పబ్లిక్ హెల్త్ విభాగాల్లో 236 పోస్టులు ఉన్నాయి. ఇంకా పంచాయతీరాజ్ హెచ్ఓడీ 3, టీఎస్ఐపీఏఆర్డీ 2, ఎలక్షన్ కమిషన్ 3 ఖాళీలు ఉన్నాయి. త్వరలో ఈ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. ప్రభుత్వం నుంచి భారీగా ఉద్యోగ నియమాకాలకు నోటిఫికేషన్లు వస్తుండటంతో నిరుద్యోగ అభ్యర్థులు ఫుల్ టైం ప్రిపరేషన్‌లో మునిగిపోతున్నారు.

కాగా తెలంగాణ వ్యాప్తంగా మొత్తం నియామ‌క ఖాళీలు 91,142 ఉండ‌గా, ఇందులో 11,103 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉన్నారు. అయితే కాంట్రాక్ట్ ఉద్యోగుల‌ను క్ర‌మ‌బద్దీక‌ర‌ణ చేయ‌గా, మిగిలిన 80,039 ఉద్యోగ ఖాళీలను భ‌ర్తీ చేస్తామని శాసనసభ వేదికగా సీఎం కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో గ్రూప్-1 పోస్టులు 503, పోలీసు, ట్రాన్స్‌పోర్టు, ఫారెస్ట్, ఎక్సైజ్, బ్రెవరేజెస్ కార్పొరేషన్ వంటి వివిధ శాఖల్లో మొత్తం 33,787 పోస్టులకు నోటిఫికేషన్లు చేసే దిశగా ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది. వీటిలో తాజాగా మంగళవారం ప్రకటించిన పోస్టులతో కలిపి ఇప్పటివరకూ మొత్తం 35220 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతులు జారీ చేసింది. త్వరలోనే మిగిలిన శాఖల్లోని ఖాళీల భర్తీకి ఉత్తర్వులు జారీ చేసేందుకు ఆర్థిక శాఖ కరసత్తు చేస్తోంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × three =