గుంటూరులో ‘వైఎస్సార్‌ యంత్ర సేవ’ పథకం పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం జగన్‌

CM Jagan Launches YSR Yantra Seva Scheme and Disburses Subsidy of Rs 175.61 Cr For Farmer Groups in Guntur, AP CM YS Jagan Launches YSR Yantra Seva Scheme and Disburses Subsidy of Rs 175.61 Cr For Farmer Groups in Guntur, AP CM Launches YSR Yantra Seva Scheme and Disburses Subsidy of Rs 175.61 Cr For Farmer Groups in Guntur, YS Jagan Launches YSR Yantra Seva Scheme and Disburses Subsidy of Rs 175.61 Cr For Farmer Groups in Guntur, YSR Yantra Seva Scheme and Disburses Subsidy of Rs 175.61 Cr For Farmer Groups in Guntur, CM Jagan Launches YSR Yantra Seva Scheme, YSR Yantra Seva Scheme, Disburses Subsidy of Rs 175.61 Cr For Farmer Groups in Guntur, CM Jagan Disburses Subsidy of Rs 175.61 Cr For Farmer Groups in Guntur, YSR Yantra Seva Scheme, AP CM YS Jagan Launches YSR Yantra Seva Scheme, YSR Yantra Seva Scheme News, YSR Yantra Seva Scheme Latest News, YSR Yantra Seva Scheme Latest Updates, YSR Yantra Seva Scheme Live Updates, AP CM YS Jagan Mohan Reddy, CM YS Jagan Mohan Reddy, AP CM YS Jagan, YS Jagan Mohan Reddy, Jagan Mohan Reddy, YS Jagan, CM Jagan, CM YS Jagan, Mango News, Mango News Telugu,

గుంటూరు, పల్నాడు జిల్లాల పర్యటనలో భాగంగా మంగళవారం గుంటూరు జిల్లా చుట్టగుంట వద్ద వైఎస్సార్‌ యంత్ర సేవ పథకం ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి మెగా మేళాలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతు గ్రూపులకు ట్రాక్టర్లు, కంబైన్డ్‌ కోత యంత్రాల పంపిణీ కార్యక్రమాన్ని జెండా ఊపి ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా 3,800 ఆర్బీకే యంత్ర సేవా కేంద్రాలకు 3,800 ట్రాక్టర్లు అందజేశారు. 1140 ఆర్బీకే కేంద్రాలకు వ్యవసాయ పనిముట్లను అందించారు. అలాగే 320 క్లస్టర్ యంత్ర సేవా కేంద్రాలకు 320 కంబైన్డ్‌ కోత యంత్రాలను పంపిణీ చేశారు. ఈ పథకం కింద రైతులకు తక్కువ అద్దె రుసుముతో పనిముట్లను అందించనున్నారు. ఈ పథకంతో పాటు 5,262 రైతు గ్రూపు బ్యాంక్‌ ఖాతాలకు రూ. 175.61 కోట్ల సబ్సిడీని బటన్‌ నొక్కి జమచేశారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం జగన్ మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రతి గ్రామంలో విత్తనం నుంచి పంట అమ్మకం వరకు ప్రతీదశలో రైతులకు తోడుగా ఉం డాటానికి దేశంలో ఎక్కడా లేని విధంగా రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. రూ. 2016 కోట్లతో ప్రతి ఆర్‌బీకే కేంద్రంలో 10,750 వైఎస్సార్‌ యంత్ర సేవా కేంద్రాలను స్థాపించేందుకు నిర్ణయం తీసుకున్నామని, ట్రాక్టర్లతో సహా వస్తువులను రైతులకు అందుబాటులో ఉంచుతామని వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా పార్టీలకు, కులాలకు అతీతంగా రైతులందరికీ ప్రతి అడుగులో అండగా ఉంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమం అనంతరం పల్నాడు జిల్లాకు పయనమయ్యారు సీఎం జగన్. జిల్లాలోని కొండవీడులో జిందాల్‌ వేస్ట్‌ టూ ఎనర్జీ ప్లాంట్‌ను ప్రారంభించనున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × one =