హైదరాబాద్‌కు రూ. 1800 కోట్ల భారీ పెట్టుబడి.. ప్రముఖ ఫార్మా కంపెనీ ‘బయోలాజికల్ ఈ’ సంస్థ కీలక నిర్ణయం

Telangana Global Pharmaceutical Company Biological E To Invest Rs 1800 Cr For Unit Expansion in Hyderabad, Global Pharmaceutical Company Biological E To Invest Rs 1800 Cr For Unit Expansion in Hyderabad, Biological E To Invest Rs 1800 Cr For Unit Expansion in Hyderabad, Global Pharmaceutical Company Biological E, Global Pharmaceutical Company, Biological E To Invest Rs 18000 Crores Signs Deal With Telangana Govt, 18000 Crores Signs Deal With Telangana Govt, Biological E To Invest Rs 18000 Crores, Vaccine Capital of the World, Biological E has announced their expansion plans, manufacturing of vaccines along with generic Injectables and R&D, Biological E To Invest Rs 18000 Crores In Telangana, Biological E, Biological E News, Biological E Latest News, Biological E Latest Updates, Biological E Live Updates, Mango News, Mango News Telugu,

తెలంగాణ రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి వచ్చింది. ప్రముఖ ఫార్మా కంపెనీ ‘బయోలాజికల్ ఈ’ హైదరాబాద్‌ లోని జీనోమ్‌ వ్యాలీలో పెట్టుబడి పెట్టనుంది. ఈ మేరకు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌తో గురువారం జరిగిన భేటీలో సంస్థ ప్రతినిధులు విస్తరణ ప్రణాళికలను ప్రకటించారు. ఇప్పటికే ఏర్పాటైన జీనోమ్ వ్యాలీలోని తమ ప్లాంట్‌లో మరో రూ.1800 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు కంపెనీ ప్రతినిధులు మంత్రికి తెలిపారు. మంత్రి కేటీఆర్‌తో భేటీ అయిన వారిలో బయోలాజికల్ ఈ ఎండీ మహిమా దాట్ల, రాష్ట్ర ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ తో పాటు తెలంగాణ లైఫ్ సైన్సెస్ డైరెక్టర్ శక్తి నాగప్పన్ తదితరులు ఉన్నారు.

కాగా ప్లాంట్‌ విస్తరణ నిర్ణయాన్ని మంత్రి కేటీఆర్‌ స్వాగతించారు. జీనోమ్ వ్యాలీలో బయోలాజికల్ ఈ విస్తరణను ప్రకటించడం ఆనందంగా ఉందని, ఇది 14 బిలియన్ డోస్ వ్యాక్సిన్‌లను ఉత్పత్తి చేసే ప్రపంచంలోని ఏకైక ప్రాంతంగా హైదరాబాద్‌ను ఉన్నత స్థానంలో నిలబెట్టిందని కేటీఆర్‌ తెలిపారు. బయోలాజికల్ ఈ.. ప్లాంట్‌ విస్తరణ కోసం రూ.1800 కోట్ల పెట్టుబడి పెట్టనుందని, దీని ద్వారా దాదాపు 2500 మందికి ఉపాధి కల్పిస్తామని కంపెనీ తెలిపినట్లు పేర్కొన్నారు.

అలాగే జీనోమ్ వ్యాలీ యూనిట్ ద్వారా జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ కొవిడ్‌ వ్యాక్సిన్‌, ఎంఆర్ వ్యాక్సిన్, పీసీవీ వ్యాక్సిన్, టైఫాయిడ్ వ్యాక్సిన్, టెటానస్ టాక్సైడ్ ఆంపౌల్స్, బయోలాజికల్ ఏపీఐలు, ఫార్ములేషన్స్ మొదలైన వాటి తయారీపై కంపెనీ దృష్టి సారించినట్లు కంపెనీ ప్రతినిధులు చెప్పారని వెల్లడించారు. ఇక మన రాజధాని నగరం ప్రపంచ వ్యాక్సిన్ల తయారీకి కూడా రాజధాని (వ్యాక్సిన్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్) గా పేరు తెచ్చుకుందని మంత్రి కేటీఆర్‌ హర్షం వ్యక్తం చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × 2 =