9 ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలకు 3,897 పోస్టులు మంజూరు చేసిన తెలంగాణ ప్రభుత్వం

Telangana Govt Accorded Sanction for Creation of 3897 Posts in Various Categories in 9 Medical Colleges,Telangana Govt Sanction 3897 Posts,9 Medical Colleges,Medical Colleges Telangana,Mango News,Mango News Telugu,Telangana Government,Telangana Govt Jobs 2022,Telangana Govt Jobs,Telangana Govt Jobs News And Live Updates,Telangana Govt Jobs Notification,Telangana Govt Jobs Notifications 2022,Telangana Govt Notifications 2022

రాష్ట్రంలో 9 ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల్లో 3,897 కొత్త పోస్టుల మంజూరుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. డైరెక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్ యొక్క పరిపాలనా నియంత్రణలో 9 మెడికల్ కాలేజీలు మరియు వాటి అనుబంధ ఆసుపత్రులకు సంబంధించి వివిధ కేటగిరీల్లో ఒక్కో కాలేజీకి 433 పోస్టుల చొప్పున మొత్తం 3897 కొత్త పోస్టులను ప్రభుత్వం మంజూరు చేసింది. అలాగే సర్వీస్ రూల్స్ డైరెక్ట్ రిక్రూట్‌మెంట్‌ను సూచించే చోట, ఈ పోస్టుల మంజూరును భర్తీ చేయడానికి చర్యలు ప్రారంభించే ముందు రాష్ట్ర ఆరోగ్య శాఖ, రాష్ట్ర ఆర్థిక శాఖ యొక్క సమ్మతిని పొందాలని తెలిపారు. రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, వికారాబాద్‌, ఖమ్మం, కరీంనగర్‌, జయశంకర్‌ భూపాలపల్లి, కొమురం భీం ఆసిఫాబాద్‌, జనగామ, నిర్మల్‌ లోని మెడికల్‌ కాలేజీల్లో ఒక్కో కాలేజీకి 433 పోస్టులు మంజూరు అయ్యాయి.

9 ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలకు 3,897 పోస్టులను ప్రభుత్వం మంజూరు చేయడంపై తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు ట్విట్టర్ వేదికగా స్పందించారు. “ఆరోగ్య తెలంగాణకు మరో పెద్ద ముందగుడు. సీఎం కేసీఆర్ దార్శనిక నాయకత్వంలో అందరికీ అందుబాటులో ఉండే హెల్త్ కేర్ సౌకర్యాలు అందించడమే లక్ష్యం. డైరెక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్ కింద వివిధ కేటగిరీలు 9 మెడికల్ కాలేజీలు మరియు వాటికీ అటాచ్డ్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రుల్లో 3897 పోస్టుల మంజూరుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, వికారాబాద్, ఖమ్మం, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, కొమరంభీం ఆసిఫాబాద్, జనగాం, నిర్మల్‌లోని 9 కొత్త మెడికల్ కాలేజీలు మరియు వాటి అటాచ్డ్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రుల్లో ఒక్కో కాలేజీకి 433 పోస్టులు సృష్టించబడ్డాయి” అని పేర్కొన్నారు.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seven + 4 =