వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ ని కలిశారు. గురువారం మధ్యాహ్నం రాజ్‌భవన్‌కు వెళ్లిన ఆమె గవర్నర్ కి ఇటీవల జరిగిన పరిణామాలపై ఫిర్యాదు చేశారు. అనంతరం రాజ్‌భవన్ వెలుపల వైఎస్ షర్మిల మీడియాతో మాట్లాడుతూ.. ఇటీవల వరంగల్ లో తన పాదయాత్రను టీఆర్ఎస్ ప్రభుత్వం అడ్డుకుందని, ఈ విషయం గురించి గవర్నర్ ను కలిసి మాట్లాడానని తెలిపారు. పాదయాత్రలో తమ బస్సులు ధ్వంసం చేసి వాహనాలకు నిప్పు పెట్టి ఇబ్బందులకు గురిచేశారని, ఆ తర్వాత దీనిపై సీఎం కేసీఆర్ ను కలిసి వివరించే ప్రయత్నం చేశానని షర్మిల వెల్లడించారు. అయితే ప్రగతిభవన్ వెళ్తున్న తనను పోలీసులు పంజాగుట్టలోనే అడ్డుకున్నారని, పోలీసులు తాను కారులో ఉండగానే టోయింగ్ చేసి స్టేషన్ కు తరలించి అరెస్టు చేశారని గుర్తు చేశారు.
ఇక ఈ సందర్భంగా తాము ఎక్కడా ట్రాఫిక్ కు ఎలాంటి అంతరాయం కలిగించలేదని, పోలీసులు వారి కార్లనే అడ్డుగా పెట్టి ట్రాఫిక్ కు అంతరాయం కలిగించారని షర్మిల ఆరోపించారు. తనను 8 గంటలపాటు స్టేషన్ లో ఉంచడమే కాకుండా పాదయాత్రను అడ్డుకునేందుకు నన్ను రిమాండ్ లో పెట్టాలని చూశారని మండిపడ్డారు. ఇదంతా పాదయాత్ర ను అడ్డుకునే కుట్ర అని, మాకు వస్తున్న ఆదరణ చూసి తట్టుకోలేకనే ఇదంతా చేశారని ఆమె చెప్పారు. సీఎం కేసీఆర్ ఇప్పటి వరకు ఆయన ఇచ్చిన హామీలు ఎందుకు నెరవేర్చడం లేదు? వీటి గురించి ప్రశ్నిస్తే అరెస్టు చేస్తారా? అని ప్రశ్నించారు. ఇక కేసీఆర్ బిడ్డ కవిత లిక్కర్ కేసులో ఉందని, కవిత ట్విట్టర్ లో కవితలు రాసుకుంటే బెటర్ అని ఎద్దేవా చేశారు. సీఎం కొడుకు, కూతురు, కుటుంబీకుల ఇళ్లలో.. అలాగే వారి బినామీల ఇళ్లలో కూడా తనిఖీలు చేయాలని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు.
ఇంకా షర్మిల మాట్లాడుతూ.. టీఆర్ఎస్ నాయకులు బాల్క సుమన్, గొంగిడి సునీత ప్రెస్ మీట్లు పెట్టి పాదయాత్ర ఎలా చేస్తారో చూస్తామని హెచ్చరిస్తున్నారని, ఏనాడైనా వీరు ప్రజల్లోకి వెళ్లి ఇబ్బందులు తెలుసుకున్నారా అని ప్రశ్నించారు. తాను పుట్టింది, చదివింది, పెళ్లి చేసుకుంది, పిల్లలు కన్నది కూడా ఇక్కడేనని, నా బ్రతుకు తెలంగాణతో ముడి పడి ఉందని స్పష్టం చేశారు. తమపై దాడులకు టీఆరెస్ నేతలు సిద్ధమయ్యారని, మమ్మల్ని కాపాడాల్సిన బాధ్యత, లా అండ్ ఆర్డర్ ను కాపాడాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని తెలిపారు. అలాగే తన ముఖంపై గాయం ఒక్కరోజులోనే తగ్గిందని అంటున్నారని, ఇక తన ప్రాణానికి ఏమైనా హాని జరిగితే ఆ బాధ్యత సీఎం కేసీఆర్ దేనని వైఎస్ షర్మిల అన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE