తెలంగాణలో స్కూళ్లకు జూన్ 20 వరకు వేసవి సెలవులు పొడిగింపు

DIET Colleges Till June 20, Mango News, Summer Holidays, Summer Holidays For Schools, summer holidays to schools, Summer Holidays to TS Schools, Telangana extends summer holidays for schools till June 20, Telangana Govt Announces Summer Holidays for Schools, Telangana Govt Extended Summer Holidays, Telangana Govt Extended Summer Holidays for Schools, Telangana Summer holidays for schools extended

తెలంగాణ రాష్ట్రంలో పాఠశాలలకు, డైట్ కాలేజీలకు జూన్ 20 వరకు వేసవి సెలవులను పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నేటితో వేసవి సెలవులు పూర్తవుతుండంతో, ప్రస్తుత పరిస్థితులను సమీక్షించిన అనంతరం వేసవి సెలవులను జూన్ 20 వరకు పొడిగించాలని నిర్ణయించినట్టు ప్రకటించారు. ఈ మేరకు తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ మంగళవారం నాడు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఆదేశాలు అమలయ్యేందుకు అవసరమైన చర్చలు తీసుకోవాలని హెడ్ ఆఫ్ ది డిపార్మెంట్స్ కు, హైదరాబాద్, వరంగల్ రీజినల్ జాయింట్ స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్లకు, జిల్లాల ఎడ్యుకేషనల్ ఆఫీసర్స్ కు, డైట్ కాలేజీల ప్రిన్సిపాల్స్ కు సూచించారు.

ముందుగా తెలంగాణలో పాఠశాలలకు ఏప్రిల్ 27 నుంచి మే 31 వరకు వేసవి సెలవులు ప్రకటించిన సంగతి తెలిసిందే. అనంతరం రాష్ట్రంలో లాక్‌డౌన్‌ అమలు, కరోనా పరిస్థితుల నేపథ్యంలో వేసవి సెలవులను జూన్ 15 వరకు పోడిగించారు. తాజాగా మరోసారి జూన్ 20 వ‌ర‌కు వేసవి సెల‌వులను పొడిగిస్తునట్టు ఉత్తర్వులు జారీ చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 − 3 =