వరద నష్టం రూ.1400 కోట్లు, ప్రాథమిక అంచనాతో తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి నివేదిక

Telangana Govt Presents Report with Estimated Loss of Rs1400 Cr Flood Related Damages to the Centre, TS Govt Presents Report with Estimated Loss of Rs1400 Cr Flood Related Damages to the Centre, Rs1400 Cr Flood Related Damages, Telangana govt puts flood Damages to the Centre, Telangana Flood Related Damages at Rs 1400 cr, Telangana suffers Rs 1400 Cr loss in floods, Centre to provide Rs 1000 crore as immediate assistance towards flood relief to the state, 1400 crore Estimated loss incurred due to floods in Telangana, floods in Telangana, Telangana floods, 1400 crore Estimated loss, Telangana Govt, Telangana, Telangana Flood Related Damages News, Telangana Flood Related Damages Latest News, Telangana Flood Related Damages Latest Updates, Telangana Flood Related Damages Live Updates, Mango News, Mango News Telugu,

తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలతో ప్రకృతి విపత్తు మూలంగా సంభవించిన వరద నష్టాలపై ప్రాథమిక అంచనాలను రాష్ట్ర ప్రభుత్వం తయారు చేసి కేంద్రానికి నివేదించింది. పలు శాఖల్లో సుమారు రూ.1400 కోట్ల వరద నష్టం సంభవించినట్టుగా కేంద్రానికి నివేదికలు అందించింది. ఈ నేపథ్యంలో రూ.1000 కోట్లను తక్షణ సాయం కింద విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. వరదల వల్ల కాజ్వేలు, రోడ్లు కొట్టుకుపోవడం తదితర కారణాల వల్ల రోడ్లు, భవనాల శాఖకు సంబంధించి రూ.498 కోట్ల నష్టం వాటిల్లింది.

పంచాయితీ రాజ్ శాఖలో రూ.449 కోట్లు, నీటిపారుదల శాఖలో రూ.33 కోట్లు, పురపాలక శాఖలో రూ.379 కోట్లు, విద్యుత్ శాఖలో రూ.7 కోట్ల నష్టం వాటిల్లినట్టు ఆయా శాఖలు ప్రాథమిక అంచనాల ద్వారా నివేదికలు సిధ్ధం చేసి కేంద్రానికి అందజేశాయి. అదే సందర్భంలో ఇండ్లు కూలిపోవడం, ముంపునకు గురికావడంతో పాటు వారిని తరలించే క్రమంలో రూ.25 కోట్లు, ఇంకా తదితర వరద నష్టాలు వెరసి మొత్తంగా రూ.1400 కోట్ల మేరకు రాష్ట్రంలో వరద నష్టం సంభవించిందని అధికారులు నివేదికలు సిధ్ధం చేసి కేంద్రానికి పంపారు.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × five =