తెలంగాణలో ధాన్యం, బియ్యం సేకరణకు కేంద్రం సిద్ధం, వెల్లడించిన కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌

Union Minister Piyush Goyal Announces Centre Ready To Procure Grain and Rice From Telangana, Union Minister Announces Centre Ready To Procure Grain and Rice From Telangana, Piyush Goyal Announces Centre Ready To Procure Grain and Rice From Telangana, Centre Ready To Procure Grain and Rice From Telangana, Union Food Minister Piyush Goyal, Union Minister Piyush Goyal, Minister Piyush Goyal, Piyush Goyal, Procure Grain and Rice From Telangana, Grain and Rice From Telangana, Row over paddy procurement, Telangana paddy procurement, paddy procurement, Telangana paddy procurement News, Telangana paddy procurement Latest News, Telangana paddy procurement Latest Updates, Telangana paddy procurement Live Updates, Mango News, Mango News Telugu,

తెలంగాణ రాష్ట్రం నుంచి ధాన్యం, బియ్యం సేకరణకు సిద్ధం అని కేంద్రం తెలిపింది. ఈ మేరకు కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ ప్రకటించారు. కాగా ధాన్యం సేకరణలో అవకతవకల ఆరోపణలు, మిల్లుల్లో ఎఫ్‌సీఐ ప్రత్యక్ష తనిఖీలు వంటివి చోటుచేసుకున్న నేపథ్యంలో.. తెలంగాణలో బియ్యం సేకరణను కేంద్రం నిలిపివేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డితో కలిసి బుధవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన పీయూష్‌ గోయల్‌ రాష్ట్ర ప్రభుత్వ తీరుతోనే ఇంతకాలం ధాన్యం మిల్లింగ్, బియ్యం సేకరణలో ప్రతిష్టంభన నెలకొందని ఆరోపించారు.

ఈ సందర్భంగా పీయూష్‌ గోయల్‌ మాట్లాడుతూ.. గురువారం నుంచి తెలంగాణలో ధాన్యం సేకరణ పునఃప్రారంభిస్తామని ఆయన వెల్లడించారు. ఎఫ్‌సీఐ ఆధ్వర్యంలో రాష్ట్రంలో బియ్యం సేకరణ ప్రక్రియ ప్రారంభించనున్నామని స్పష్టం చేసిన గోయల్ అలాగే ధాన్యం సేకరణలో అవకతవకలపై తెలంగాణకు ఆడిట్‌ బృందాలను పంపిస్తామన్నారు. రాష్ట్రం నుంచి సెంట్రల్‌ పూల్‌కు బియ్యం తీసుకునేందుకు నిర్ణయించుకున్నామని, అయితే తెలంగాణ ప్రభుత్వం ఎఫ్‌సీఐకు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ‘ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన’ పథకం కింద, జాతీయ ఆహార భద్రతా చట్టం కింద దేశంలోని 80 కోట్ల మంది అర్హులైన లబ్ధిదారులకు కేంద్రం నెలకు 5 కిలోల అదనపు ధాన్యాలను ఉచితంగా అందిస్తుందని గుర్తు చేశారు. దీనికోసం రాష్ట్రాల నుంచి భారీగా ధాన్యం సేకరిస్తున్నామని గోయల్‌ తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

15 + 9 =