వాసాలమర్రికి రూ.7.60 కోట్ల ద‌ళిత బంధు నిధులు విడుద‌ల‌

CM in Vasalamarri, CM KCR Adopted Vasalamarri Village, CM KCR Announces Dalit Bandhu for Vasalamarri, CM KCR Visits Dalit Colony in Vasalamarri Village, Dalit Bandhu, Dalit Bandhu scheme, Dalit Bandhu Scheme Pilot Project, Each SC Family in Village will Get Rs 10 Lakh In Vasalamarri, KCR visit Vasalamarri village, Mango News, Telangana CM KCR Visits Vasalmarri Village, Telangana Dalit Bandhu scheme, Telangana Govt Released Rs 7.6 Crore Dalit Bandhu Funds, Telangana Govt Released Rs 7.6 Crore Dalit Bandhu Funds for Vasalamarri Village, Vasalamarri, Vasalamarri Village

ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆగస్టు 4, బుధవారం నాడు యాదాద్రి భువ‌న‌గిరి జిల్లా తుర్క‌ప‌ల్లి మండ‌లంలోని దత్తత గ్రామం వాసాల‌మ‌ర్రిలో పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా వాసాలమర్రిలోని 76 ద‌ళిత కుటుంబాల‌కు దళితబంధు పథకాన్ని వెంటనే అమలు చేయనున్నట్టు సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. అందుకోసం అవసరమైన రూ.7.60 కోట్లు త‌క్ష‌ణ‌మే మంజూరు చేస్తున్నాన‌ని, గురువారం నుంచే ద‌ళితుల ఖాతాల్లో రూ.10 ల‌క్ష‌ల చొప్పున నగదు జమ చేస్తామని తెలిపారు. ఈ నేపథ్యంలో గురువారం నాడు వాసాలమర్రికి “తెలంగాణ దళిత బంధు” పథకం నిధులును రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది.

76 దళిత కుటుంబాలకు 7 కోట్ల 60 లక్షలను యాదాద్రి భువనగిరి కలెక్టర్ ఖాతాలో జమ చేశారు. సీఎం కేసీఆర్ బుధవారం చేసిన ప్రకటన మేరకు నిధులు విడుదల చేయడం జరిగిందని, టీఎస్ సీసీడీసీ లిమిటెడ్ (హైదరాబాద్) వైస్ ఛైర్మన్ అండ్ ఎండీ, యాదాద్రి భువనగిరి కలెక్టర్ ఇందుకు సంబంధించిన అన్ని అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చారు. ఈ మేరకు ఎస్సీ అభివృద్ధి శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా ఉత్తర్వులు జారీ చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × 3 =