ప్రభుత్వ డాక్టర్ల ప్రైవేట్‌ ప్రాక్టీస్‌పై నిషేధం.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

Telangana Health Department Issues GO Regarding Bans on Private Practice of Govt Doctors, Telangana Bans on Private Practice of Govt Doctors, Private Practice of Govt Doctors, Telangana Health Department Issues GO, ban on private practice by government hospital doctors, Telangana government issued an order imposing a total ban on private practice for doctors, private practice for doctors, Telangana Issues GO to ban private practice for government doctors, private practice for government doctors, Telangana Health Department, Telangana Health Department New GO News, Telangana Health Department New GO Latest News, Telangana Health Department New GO Latest Updates, Telangana Health Department New GO Live Updates, Mango News, Mango News Telugu,

ప్రభుత్వ వైద్యుల విషయంలో తెలంగాణ సర్కార్‌ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ వైద్యుల ప్రైవేట్ ప్రాక్టీస్‌పై పూర్తి నిషేధం విధించింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీని ద్వారా డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా కొత్తగా ఉద్యోగాల్లో చేరే వైద్యులు ఇక నుంచి ప్రైవేట్‌ ప్రాక్టీస్‌ చేయకుండా నిషేధం విధించింది. ఈ క్రమంలో కొత్తగా ఉద్యోగాల్లో చేరే ప్రభుత్వ వైద్యులు.. ఇకపై ప్రైవేట్‌ ప్రాక్టీస్‌ చేయడానికి వీల్లేకుండా ఈ మేరకు మెడికల్‌ ఎడ్యుకేషన్‌ సర్వీస్‌ నిబంధనలను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ సవరించింది. మంగళవారం నోటిఫికేషన్ వెలువడిన తర్వాత నియామకమైన నాన్ టీచింగ్ వైపు నుంచి బదిలీ ద్వారా భర్తీ చేసే పోస్టుల్లోని వైద్యులకు కూడా ప్రైవేట్ ప్రాక్టీస్‌కు అనుమతి ఉండదు.

తెలంగాణలో డాక్టర్లు, స్టాఫ్‌ నర్సులు, ఏఎన్‌ఎంలు, పారామెడికల్‌ సిబ్బంది ఖాళీలకు కొత్తవారిని నియమించాలని నిర్ణయించిన ప్రభుత్వం అందుకోసం కసరత్తు చేపట్టింది. ఈ నేపథ్యంలో నియామక మార్గదర్శకాల్లో ప్రభుత్వ డాక్టర్ల ప్రైవేటు ప్రాక్టీస్‌ రద్దు అంశంపై కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వాసుపత్రి వైద్యుల ప్రైవేట్ ప్రాక్టీస్‌పై నిషేధం విధించే అవకాశాలను తెలంగాణ ఆరోగ్య శాఖ గత కొంత కాలంగా పరిశీలిస్తోంది. ఈ కఠిన నిబంధన అమల్లోకి వస్తే, రాబోయే సంవత్సరాల్లో ప్రభుత్వ ఉద్యోగాల్లోకి రిక్రూట్ అయ్యే వారిపై ఇది ప్రభావవంతంగా ఉంటుందని భావిస్తోంది. ప్రభుత్వ వైద్యుల ప్రైవేట్ ప్రాక్టీస్‌ను నిషేధించాలని ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

14 + nine =