రాజమహేంద్రవరంలో “గోదావరి గర్జన” సభలో పాల్గొన్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా

BJP National President JP Nadda Addressed Godavari Garjana Public Meeting in Rajamahendravaram, National President JP Nadda Addressed Godavari Garjana Public Meeting in Rajamahendravaram, JP Nadda Addressed Godavari Garjana Public Meeting in Rajamahendravaram, BJP National President Addressed Godavari Garjana Public Meeting in Rajamahendravaram, Godavari Garjana Public Meeting in Rajamahendravaram, Rajamahendravaram, Godavari Garjana Public Meeting, Rajamahendravaram Godavari Garjana Public Meeting, BJP National President JP Nadda, National President JP Nadda, BJP National President, National President, JP Nadda, Godavari Garjana Public Meeting News, Godavari Garjana Public Meeting Latest News, Godavari Garjana Public Meeting Latest Updates, Godavari Garjana Public Meeting Live Updates, Mango News, Mango News Telugu,

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ(బీజేపీ) జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రెండో రోజు పర్యటన కొనసాగుతుంది. రెండో రోజు పర్యటనలో భాగంగా మంగళవారం సాయంత్రం రాజమహేంద్రవరం ఆర్ట్స్‌ కళాశాల మైదానంలో ఏపీ బీజేపీ నిర్వహిస్తున్న “గోదావరి గర్జన” భారీ బహిరంగసభలో జేపీ నడ్డా ముఖ్యఅతిధిగా హాజరై కీలక ప్రసంగం చేశారు. ఈ బహిరంగ సభకు భారీ సంఖ్యలో వచ్చిన ప్రజలను, కార్యకర్తలను చూస్తుంటే, రాబోయే కాలంలో ఇక్కడి ప్రభుత్వానికి వీడ్కోలు పలుకుతామని, బీజేపీ ప్రభుత్వాన్ని తీసుకువస్తున్నట్టుగా ప్రకటించినట్టు ఉందని జేపీ నడ్డా అన్నారు. ఈ ప్రాంతం తెలుగు సంస్కృతిని ప్రతిబించేలా ఉంటుందనన్నారు. ఒకప్పుడు విధానాలు, కార్యక్రమాలు కేవలం కాగితాలపైనే ఉండేవని, కానీ ప్రధాని మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం వచ్చాక క్షేత్రస్థాయిలో విధానాలు, కార్యక్రమాలు అమలులోకి వచ్చాయన్నారు.

గతంలో దేశంలో బంధుప్రీతి, వారసత్వ పద్ధతిలో పాలన సాగేదని, ప్రధాని మోదీ ఆ విధానాన్ని పూర్తిగా మార్చేశారని అన్నారు. ఒక దేశం-ఒక గ్రిడ్, ఒక దేశం-ఒక రేషన్ కార్డ్, పీఎం ఆవాస్ యోజన ద్వారా 2.5 కోట్ల ఇళ్లు, ఆయుష్మాన్‌ భారత్‌, 2.5 కోట్ల గ్రామాలకు ఇంటర్నెట్ సేవలు ఇలా ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చామని చెప్పారు. రెండో అతిపెద్ద రిటైల్‌ చైన్‌గా భారత్‌ మారిందన్నారు. మరోవైపు దేశంలో 5 శాతం జనాభా ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రహదారుల విస్తరణకు బడ్జెట్ లో 21% నిధులు కేటాయించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై తనకు ఉన్న ప్రేమను ప్రధాని మోదీ చాటుకున్నారని జేపీ నడ్డా పేర్కొన్నారు. ఆర్ధిక క్రమశిక్షణ లేకపోవడంతో రాష్ట్రం అప్పులబాటలో పడిందన్నారు. నిరుద్యోగ సమస్య కూడా పెరుగుతుందన్నారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని జేపీ నడ్డా ఈ సందర్భంగా విశ్వాసం వ్యక్తం చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

15 + 4 =