ఇబ్రహీంపట్నం ఘటనపై విచారణకు ఆదేశించాం, బాధిత కుటుంబాలకు ప్రభుత్వ సాయం – తెలంగాణ డీహెచ్ శ్రీనివాసరావు

Telangana Health Director Srinivasa Rao Responds Over The Ibrahimpatnam Incident, 2 Women Killed in Botched Tubectomy, Botched Tubectomy Kills 2 Women in Govt Hospital, Mango News,Mango News Telugu, Botched Tubectom Gone Wrong In Ibrahimpatnam, Telangana Health Director Srinivasa Rao, DH Srinivasa Rao, Family Planning Operation, Telangana Latest News And Updates, Family Planning Operation In Telangana, Health Director Srinivasa Rao, Telangana News

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ప్రభుత్వాసుపత్రిలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు వికటించి నలుగురు మహిళలు మృతి చెందిన ఘటనపై తెలంగాణ డీహెచ్ శ్రీనివాసరావు స్పందించారు. ఈ ఘటన దురదృష్టకరమని, ఇలా జరిగి ఉండాల్సింది కాదని ఆయన అన్నారు. కాగా ఈ ఘటనలో సోమవారం ఇద్దరు, మంగళవారం మరో ఇద్దరు మహిళలు మృతి చెందారు. దీనిపై డీహెచ్ శ్రీనివాసరావు మంగళవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కుటుంబ నియంత్రణ (కు.ని.) ఆపరేషన్లు ఒక్క తెలంగాణలోనే కాకుండా దేశవ్యాప్తంగా జరిగే సాధారణ ప్రక్రియ అని, గతేడాది కూడా రాష్ట్రంలో 38వేల మందికి పైగా కు.ని. ఆపరేషన్లు నిర్వహించామని పేర్కొన్నారు.

తాజాగా ఇబ్రహీంపట్నంలో ఈ ఆపరేషన్లు చేసిన వైద్యుడు చాలా అనుభవజ్ఞుడని, అయినా ఇలా జరగడం దురదృష్టకరమని శ్రీనివాసరావు తెలిపారు. తెలంగాణ ఏర్పాటైన తర్వాత ఇలాంటి ఘటనలు ఇదే మొదటిసారని, ఇక ఈ ఘటనలో బాధ్యులుగా గుర్తిస్తూ ఇద్దరు వైద్యాధికారులపై సస్పెన్షన్‌ వేటు వేశామని వెల్లడించారు. అలాగే దీనిపై విచారణ కోసం ఒక కమిటీ వేశామని, వారం రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించామని వివరించారు. మొత్తం 34 మందిలో 4గురు మహిళలు చనిపోయారని, కాజ్‌ ఆఫ్‌ డెత్‌ కోసం ఆ నలుగురికి పోస్టుమార్టం నిర్వహించామని తెలియజేశారు. మిగిలిన 30 మందిని కలిసి వారి ఆరోగ్య పరిస్థితిని మానిటరింగ్‌ చేస్తున్నామని, వీరిలో ఏడుగురిని ముందు జాగ్రత్తగా హైదరాబాద్‌ ఆస్పత్రికి తరలించామని, మరో ఇద్దరు మహిళలను నిమ్స్‌కు తరలించామని డీహెచ్ చెప్పారు.

ఇక ఈ ఘటనలో మృతి చెందిన మహిళల కుటుంబాలకు సంతాపం ప్రకటిస్తున్నామని, వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని శ్రీనివాసరావు ప్రకటించారు. ఆ మహిళల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా అందించనుంది, దీనితోపాటు డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు కూడా మంజూరు చేయనుందని తెలిపారు. అలాగే వారి పిల్లల చదువులకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని ఆయన హామీ ఇచ్చారు. భవిష్యత్‌లో మళ్ళీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. అయితే కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు కేవలం మహిళలకే కాదని పురుషులు కూడా ముందుకు రావాలని సూచించారు. మహిళల ఆరోగ్యం చాలా ముఖ్యమైందని, దీనిని దృష్టిలో పెట్టుకుని పురుషులు ఎలాంటి సంకోచం లేకుండా కు.ని. ఆపరేషన్లు చేయించుకోవాలని శ్రీనివాసరావు సలహా ఇచ్చారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen − three =