తెలంగాణలో 5,204 స్టాఫ్ నర్సుల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

Telangana Medical Health Services Recruitment Board Released Notification for Filling up 5204 Vacancies of Staff Nurses,Telangana Medical Health Services,Medical Health Services Recruitment Board,Notification for Filling up 5204 Vacancies,Staff Nurses 5204 Vacancies,Staff Nurses Notification,Staff Nurses Recruitment,Mango News,Mango News Telugu,CM KCR News And Live Updates, Telangna Congress Party, Telangna BJP Party, YSRTP,TRS Party, BRS Party, Telangana Latest News And Updates,Telangana Politics, Telangana Political News And Updates,YSRTP Chief YS Sharmila,YSRTP Chief YS Sharmila Latest News and Updates

తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతుంది. తాజాగా 5,204 స్టాఫ్ నర్సుల పోస్టుల భర్తీకి తెలంగాణ మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టుల కోసం అర్హులైన అభ్యర్థులు దరఖాస్తులను ఆన్‌లైన్‌లో సమర్పించే సౌకర్యం 2023, జనవరి 25 నుండి అందుబాటులో ఉంటుందని తెలిపారు. అలాగే దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ 2023, ఫిబ్రవరి 15 అని తెలిపారు.

ఈ నోటిఫికేషన్ పై తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు స్పందిస్తూ, “సీఎం కేసీఆర్ వాగ్దానం చేసిన విధంగా 5,204 స్టాఫ్ నర్సుల నియామకానికి మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ మరో నోటిఫికేషన్ విడుదల చేయడంతో తెలంగాణలో రిక్రూట్‌మెంట్-ఫెస్ట్ మరింత ముమ్మరంగా కొనసాగుతోంది. దీంతో 7,320 పోస్టులకు రిక్రూట్‌మెంట్ ప్రక్రియ చేపట్టగా, అందులో ఇప్పటికే 969 సీఏఎస్‌లను నియమించారు” అని పేర్కొన్నారు.

తెలంగాణలో స్టాఫ్ నర్సుల పోస్టుల భర్తీ (5,204)

  1. డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్/ డైరెక్టర్ ఆఫ్ ప్రజారోగ్యం మరియు కుటుంబ సంక్షేమం – 3823
  2. తెలంగాణ వైద్య విధాన పరిషత్ – 757
  3. ఎంఎన్జే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీ అండ్ రీజినల్ క్యాన్సర్ సెంటర్ – 81
  4. వికలాంగులు మరియు సీనియర్ సిటిజన్ల సంక్షేమ విభాగం – 8
  5. తెలంగాణ మైనారిటీస్ రెసిడెన్సియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిస్ట్యూషన్స్ సొసైటీ – 127
  6. మహాత్మా జ్యోతిబాఫూలే తెలంగాణ బ్యాక్ వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ రెసిడెన్సియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిస్ట్యూషన్స్ సొసైటీ – 197
  7. తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్సియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిస్ట్యూషన్స్ సొసైటీ (గురుకులం) – 74
  8. తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిస్ట్యూషన్స్ సొసైటీ – 124
  9. తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిస్ట్యూషనల్ సొసైటీ – 13.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fourteen − 12 =