డీజీపీ మహేందర్ రెడ్డిని సన్మానించిన హోంమంత్రి మహమూద్ అలీ

Telangana Home Minister Mahmood Ali Felicitated DGP Mahender Reddy,Telangana Home Minister Mahmood Ali,Mahmood Ali Felicitated DGP,DGP Mahender Reddy,Mango News,Mango News Telugu,CM KCR News And Live Updates, Telangna Congress Party, Telangna BJP Party, YSRTP,TRS Party, BRS Party, Telangana Latest News And Updates,Telangana Politics, Telangana Political News And Updates,YSRTP Chief YS Sharmila,YSRTP Chief YS Sharmila Latest News and Updates

డీజీపీ ఎం.మహేందర్ రెడ్డిని తెలంగాణ రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమ్మద్ మహమూద్ అలీ శుక్రవారం నాడు సన్మానించారు. హైదరాబాద్ లోని లకిడికాపూల్ లో హోం మంత్రి కార్యాలయంలో ఈ ప్రత్యేక కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా చార్మినార్ జ్ఞాపికను హోం మంత్రి డీజీపీకి బహూకరించారు. ఈ కార్యక్రమంలో హోంమంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి పోలీస్ అధికారిగా వివిధ హోదాల్లో మహేందర్ రెడ్డి చక్కటి సేవలందించారని కొనియాడారు. దేశంలోనే రాష్ట్ర పోలీసు శాఖను అగ్రస్థానంలో నిలబెట్టారని ప్రశంసించారు. విధి నిర్వహణలో తనదైన ముద్ర వేశారని, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ గా, రాష్ట్ర డీజీపీగానూ, దాదాపు 34 సంవత్సరాల పాటు పోలీసు అధికారిగా వివిధ హోదాల్లో పనిచేసి అందరి మన్ననలు పొందారని హోం మంత్రి ప్రశంసించారు.

ఐదు సంవత్సరాలకుపైగా డీజీపీగా పనిచేసి మహేందర్ రెడ్డి తెలంగాణ పోలీసు శాఖను అగ్రభాగాన నిలిపారని పేర్కొన్నారు. హోంశాఖ ముఖ్య కార్యదర్శి రవిగుప్త, అడిషనల్ డీజీపీలు జితేందర్, సంజయ్ కుమార్ జైన్, తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. మరోవైపు డీజీపీ ఎం.మ‌హేంద‌ర్ రెడ్డి నేడు (డిసెంబర్ 31, శనివారం) ప‌ద‌వీ విర‌మ‌ణ చేయ‌నున్న విషయం తెలిసిందే.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here