కేంద్రంలోని బీజేపీ స‌ర్కార్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన తెలంగాణ మంత్రి కేటీఆర్

Telangana Minister KTR Slams BJP Govt Over Its Policies in The Country, KTR Slams BJP Govt Over Its Policies in The Country, BJP Govt Policies in The Country, BJP Govt Policies, BJP Policies, Minister KTR Slams BJP Govt, Telangana Minister KTR Comments On BJP Govt Over Its Policies in The Country, Telangana Minister KTR Sensational Comments On BJP Govt Over Its Policies in The Country, Telangana Minister KTR Intresting Comments On BJP Govt Over Its Policies in The Country, BJP Govt Policies News, BJP Govt Policies Latest News, BJP Govt Policies Latest Updates, Working President of the Telangana Rashtra Samithi, Telangana Rashtra Samithi Working President, TRS Working President KTR, Telangana Minister KTR, KT Rama Rao, Minister of Municipal Administration and Urban Development of Telangana, KT Rama Rao Minister of Municipal Administration and Urban Development of Telangana, KT Rama Rao Information Technology Minister, KT Rama Rao MA&UD Minister of Telangana, Mango News, Mango News Telugu,

కేంద్రంలోని బీజేపీ స‌ర్కార్‌పై తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో వివిధ అంశాలపై కేంద్రం అనుస‌రిస్తున్న ప్ర‌భుత్వ విధానాల‌ను కేటీఆర్ త‌ప్పుప‌ట్టారు. ప్రతి ఎన్నికలలో ప్రధాని మోదీ దేశంలోని నిరుద్యోగంపై హామీలు ఇస్తుంటారని, కానీ అధికారంలోకి వచ్చి ఇన్నేళ్లయినా ఇప్పటికీ ఈ సమస్యకు పరిష్కారం చూపలేకపోయారని పేర్కొన్నారు. దేశంలో గ‌డిచిన 45 ఏళ్ల‌లో ఎన్నడూ లేనంత‌గా నిరుద్యోగ సమస్య పెరిగినట్లు మంత్రి కేటీఆర్ ఆరోపించారు. దేశంలోని పలు అంశాలపై కేంద్రప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై మంత్రి కేటీఆర్ ట్విట్ట‌ర్ వేదిక‌గా విరుచుకుపడ్డారు.

దేశంలో ద్ర‌వ్యోల్బ‌ణం 30 ఏళ్ల గ‌రిష్టానికి చేరుకుందని ఆరోపిస్తూ కేంద్ర స‌ర్కార్ విధానాల‌ను సూటిగా ప్రశ్నించారు మంత్రి కేటీఆర్. ఇటీవల కేంద్ర వాణిజ్య మంత్రిత్వ‌శాఖ రిలీజ్ చేసిన ఒక డేటాను విశ్లేషిస్తూ ఓ ఆంగ్ల ప‌త్రిక రాసిన క‌థ‌నాన్ని ప్రచురించింది. దీనిని మంత్రి కేటీఆర్ త‌న ట్వీట్‌లో ట్యాగ్ చేశారు. దీనిలో దేశంలో ద్ర‌వ్యోల్బ‌ణం 30 ఏళ్ల గ‌రిష్టానికి చేరిన‌ట్లు తెలుస్తోందని, దీనిపై కేంద్రం ఏం చర్యలు తీసుకుందని ప్రశ్నించారు. ఇంధ‌న ధ‌ర‌లు కూడా విపరీతంగా పెరిగాయని, నిత్యావసర వస్తువైన గ్యాస్ సిలిండర్ రేట్లు కూడా భారీగా పెంచారని ఆయ‌న త‌న ట్విట్ట‌ర్‌లో విమ‌ర్శించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × four =