జనవరి 11, 12వ తేదీల్లో తెలంగాణలో పర్యటించనున్న రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జ్ మాణిక్‌రావ్‌ ఠాక్రే

Telangana New AICC Incharge Manikrao Thakare will visit State on January 11 and 12,Manickam Tagore,Manikrao Thakre,Manickam Tagore Resigned,Manikrao Thakre New Incharge For T-Congress,T-Congress,AICC Appoints Manikrao Thakre,Mango News,Mango News Telugu,CM KCR News And Live Updates, Telangna Congress Party, Telangna BJP Party, YSRTP,TRS Party, BRS Party, Telangana Latest News And Updates,Telangana Politics, Telangana Political News And Updates

తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జిగా మహారాష్ట్రకు చెందిన కీలక నేత మాణిక్‌రావ్‌ ఠాక్రేను నియమిస్తూ కాంగ్రెస్ హైకమాండ్ ఇటీవలే నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మాణిక్‌రావ్‌ ఠాక్రే జనవరి 11, 12వ తేదీల్లో ఇన్‌చార్జి హోదాలో తొలిసారిగా తెలంగాణలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సహా తెలంగాణ సీనియర్ నేతలు, వర్కింగ్ ప్రెసిడెంట్లతో ఆయన సమావేశం కానున్నారు. ఈ మేరకు మాణిక్‌రావ్‌ ఠాక్రే రెండు రోజుల పర్యటన షెడ్యూల్ ను ఇప్పటికే విడుదల చేశారు.

జనవరి 11, బుధవారం షెడ్యూల్:

  • 07.20 గంటలు : ఢిల్లీ నుండి హైదరాబాద్ కు ప్రయాణం ప్రారంభం
  • 09.25: రాజీవ్ గాంధీ ఎయిర్ పోర్ట్ కు చేరిక
  • 10.30: గాంధీ భవన్ కు చేరిక
  • 10.30-11.30: – ఏఐసీసీ కార్యదర్శులు ఇంచార్జిలు (తెలంగాణ) తో సమావేశం
  • 11.30-12.00: తెలంగాణ పీసీసీ అధ్యక్షుడితో భేటీ
  • 12.00-12.30: తెలంగాణ సీఎల్పీ నేతతో సమావేశం
  • 12.30-02.00: తెలంగాణ సీనియర్ నేతలు, వర్కింగ్ ప్రెసిడెంట్లతో సమావేశం
  • 02.00-03.00: రిజర్వ్
  • 03.00-04.00:రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ)తో సమావేశం
  • 04.00-05.00: ఎగ్జిక్యూటివ్ కమిటీతో సమావేశం
  • 05.00-06.00: పీసీసీ ఆఫీస్ బేరర్లతో సమావేశం
  • బుధవారం రాత్రికి హైదరాబాద్‌లో బస

జనవరి 12, గురువారం షెడ్యూల్:

  • 10.30-11.30: తెలంగాణ డీసీసీ అధ్యక్షులతో సమావేశం
  • 11.30-12.30: తెలంగాణ ఫ్రంటల్ ఆర్గనైజేషన్ అధ్యక్షులతో సమావేశం
  • 12.30-01.30: తెలంగాణలోని సెల్, డిపార్ట్‌మెంట్ అధ్యక్షులతో సమావేశం
  • 01.30-02.00: ఇతర సమావేశాల కోసం రిజర్వ్
  • 02.00-03.00: రిజర్వ్
  • గురువారం సాయంత్రం తిరిగి ఢిల్లీకి బయలుదేరుతారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × two =