షెడ్యూల్ 9, 10 సంస్థల విభజనపై ఏపీ ప్రభుత్వం పిటీషన్‌.. సుప్రీంలో విచారణ, కేంద్రం, తెలంగాణకు నోటీసులు

SC Issues Notices To Centre and Telangana in AP Govt Petition on Demerger Institutions of Schedule 9 & 10,SC Issues Notices To Centre,Telangana,AP Govt Petition,Demerger Institutions of Schedule,Schedule 9 & 10,Mango News,Mango News Telugu,Tdp Chief Chandrababu Naidu,AP CM YS Jagan Mohan Reddy,YS Jagan News And Live Updates, YSR Congress Party, Andhra Pradesh News And Updates, AP Politics, Janasena Party, TDP Party, YSRCP, Political News And Latest Updates,AP BJP Party

ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు షెడ్యూల్ 9, 10 సంస్థల ఆస్తులను పంపిణీ చేయాలని కోరుతూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటీషన్‌ దాఖలు చేసింది. పిటీషన్‌లో కేంద్ర ప్రభుత్వంతో పాటు తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రతివాదులుగా చేర్చింది. ఈ క్రమంలో సోమవారం ఏపీ ప్రభుత్వ పిటీషన్‌పై సుప్రీం ధర్మాసనం విచారణ చేపట్టింది. అయితే ఈ విచారణకు కేంద్ర, తెలంగాణ ప్రభుత్వాల తరపు న్యాయవాదులు హాజరు కాలేదు. దీంతో కేంద్రంతో పాటు తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని సూచించిన అత్యున్నత న్యాయస్థానం తదుపరి విచారణను 6 వారాల పాటు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.

కాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తన పిటీషన్‌లో.. రాష్ట్ర విభజన జరిగి ఎనిమిదేళ్లు గడుస్తున్నా, షెడ్యూల్ 9, 10 సంస్థల విభజనలో జాప్యం జరుగుతుండటం కారణంగా ఏపీకి నష్టం వాటిల్లుతోందని కోర్టుకి తెలిపింది. అలాగే విభజన చట్టంలోని షెడ్యూల్ 9, 10 సంస్థల విలువ సుమారు రూ.1,42,600 కోట్లకు పైగా ఉంటుందని, వీటిలో 90శాతం పైబడి తెలంగాణ రాష్ట్రంలోనే ఉన్నాయని కోర్టు దృష్టికి తెచ్చారు. వీటి పరిష్కారం కోసం తెలంగాణ ప్రభుత్వం చొరవ చూపడం లేదని, ఇది ఏపీ ప్రజల ప్రాథమిక హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని తెలిపారు. ఇకనైనా షెడ్యూల్ 9, 10 సంస్థల విభజన సత్వరమే జరిగేలా చూడాలని, ఈ మేరకు ఆదేశాలు ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును కోరింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

9 + nineteen =