మందు ప్రియులకు శుభవార్త, న్యూఇయర్ సందర్భంగా డిసెంబర్ 31న అర్ధరాత్రి 12 వరకు మద్యం దుకాణాలు ఓపెన్

Telangana: Permit to Open Liquor Shops upto 12 Midnight on December 31st on the Occasion of New Year Celebrations,Telangana Permit to Open Liquor Shops,New Year Celebrations,Liquor Shops upto 12 Midnight,Mango News,Mango News Telugu,2023 New Year Celebrations,New Year Celebrations Guidelines,Hyderabad New Year Celebrations,Hyderabad New Year Guidelines,Hyderabad Party Organisers,Organisers Need Permission,Permission For New Year,Permission For New Year By Dec 23,Hyderabad Latest News and Updates,New Year By Dec 23,New Year 2023,Happy New Year,Happy New Year 2023,New Year,New Year Latest News and Updates,New Year Celebrations,New Year Celebrations News and Live Updates

2023 నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో మద్యం ప్రియులకు శుభవార్త అందింది. నూతన సంవత్సర వేడుకలను దృష్టిలో ఉంచుకుని మద్యం దుకాణాలు మరియు బార్లలో మద్యాన్ని విక్రయించే సమయాన్ని పెంచేందుకు అనుమతి ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. డిసెంబరు 31వ తేదీన అన్ని ఏ4 లైసెన్సిస్ (రిటైల్ షాపులు) మద్యం దుకాణాలను అర్ధరాత్రి 12 గంటల వరకు ఓపెన్ చేసేందుకు, మద్యం విక్రయించేందుకు ప్రభుత్వం అనుమతిచ్చింది.

అలాగే డిసెంబర్‌ 31 మరియు జనవరి 1 వ తేదీల్లో 2బీ బార్లలో, సీ1 లైసెన్సిస్ (ఇన్-హౌస్), టూరిజం డెవలప్మెంట్ కార్పోరేషన్ పరిధిలో నడిచే మద్యం దుకాణాల్లో (టీడీ1 ఇన్-హౌస్ లైసెన్సిస్), ఈపీ1 లైసెన్సిస్ (ఈవెంట్ పర్మిట్) ఉన్నవారు అర్థరాత్రి 1 గంట వరకు మద్యం అమ్మకాలు/సరఫరా చేసేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కాగా అన్ని చోట్ల కోవిడ్-19 నిబంధనల పాటించాలని, అందుకు అనుగుణంగా మద్యం అమ్మకాలు జరుపుకోవాలని సూచించారు. ఈ మేరకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డైరెక్టర్ కు ఆదేశాలు ఇస్తూ ప్రభుత్వం ఇటీవలే ఉత్తర్వులు జారీ చేసింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × 5 =