ప్రపంచాన్ని మెరుగైన ప్రదేశంగా మార్చే శక్తి ఇంజనీర్లకు ఉంది, నారాయణమ్మ కాలేజీలో రాష్ట్రపతి ప్రసంగం

President Droupadi Murmu Addresses Students of G Narayanamma Institute of Technology and Science for Women,President Droupadi Murmu,G Narayanamma Institute of Technology and Science,President Droupadi Murmu Addresses Students,Mango News,Mango News Telugu,G Narayanamma Institute Of Technology And Science Course Admissions,G.Narayanamma Institute Of Technology And Science Address,Narayanamma Engineering College,G Narayanamma Institute Of Technology And Science Placements 2022,G.Narayanamma Institute Of Technology And Science Fee Structure,G Narayanamma Institute Of Technology And Science Cut Off Ranks,G Narayanamma Institute Of Technology And Science Placements,G Narayanamma Institute Of Technology And Science B Category,G.Narayanamma Institute Of Technology And Science Contact Number,G.Narayanamma Institute Of Technology And Sciences Eamcet Code,G Narayanamma Institute Of Technology And Science Hostel,Gandhinagar Institute Of Technology Fees,Baba Institute Of Technology And Sciences Fee Structure

తెలంగాణలో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శీతాకాల విడిది పర్యటన కొనసాగుతుంది. ఐదు రోజుల పర్యటనలో భాగంగా డిసెంబర్ 26న సికింద్రాబాద్‌ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంకు చేరుకున్న ఆమె వరుసగా పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో నాలుగో రోజు (డిసెంబర్ 29, గురువారం) పర్యటనలో భాగంగా హైదరాబాద్‌లోని జి.నారాయణమ్మ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ ఫర్ ఉమెన్ విద్యార్థులు మరియు అధ్యాపకులను ఉద్దేశించి మరియు బిఎమ్ మలానీ నర్సింగ్ కాలేజ్ మరియు మహిళా దక్షతా సమితికి చెందిన సుమన్ జూనియర్ కాలేజీ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు.

సాంకేతికత యొక్క ప్రయోజనాలు మారుమూల ప్రాంతాలకు మరియు పేదలలోని పేదలకు చేరాలని, దీనిని సామాజిక న్యాయ సాధనంగా ఉపయోగించుకోవాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. కంప్యూటర్లు, వైద్య పరికరాలు, ఇంటర్నెట్, స్మార్ట్ పరికరాలు మరియు డిజిటల్ చెల్లింపు వ్యవస్థలతో సహా సాంకేతిక పురోగతిలో ఇంజనీరింగ్ పెద్ద పాత్ర పోషిస్తున్నదని రాష్ట్రపతి అన్నారు. ఊహించలేని మరియు అపూర్వమైన సమస్యలకు త్వరిత మరియు స్థిరమైన పరిష్కారాలు అవసరమయ్యే నేటి ప్రపంచంలో ఒక వృత్తిగా ఇంజనీరింగ్ పాత్ర చాలా క్లిష్టమైనదన్నారు. ప్రపంచాన్ని మెరుగైన ప్రదేశంగా మార్చే శక్తి ఇంజనీర్లకు ఉందని రాష్ట్రపతి అన్నారు.

ఇంజనీర్స్ కనుగొనే పరిష్కారాలు మరియు భవిష్యత్తులో వారు రూపొందించే సాంకేతికతలు ప్రజల-ఆధారితంగా మరియు పర్యావరణ అనుకూలమైనవిగా ఉండాలన్నారు. ఇటీవల సీఓపీ27లో, భారతదేశం సేఫ్ ప్లానెట్ గురించి తన విజన్ ను లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్‌మెంట్ అనే వన్ వర్డ్ మంత్రంలో పునరుద్ఘాటించిందన్నారు. మనం వాతావరణ లక్ష్యాలను సాధిస్తున్నామని మరియు వాటిని అప్‌గ్రేడ్ చేస్తున్నామన్నారు. పునరుత్పాదక శక్తి, ఇ-మొబిలిటీ, ఇథనాల్-మిశ్రమ ఇంధనాలు మరియు గ్రీన్ హైడ్రోజన్‌లో కొత్త చొరవలను తీసుకుంటున్నామని, ఈ కార్యక్రమాలు సాంకేతిక ఆవిష్కరణల ద్వారా క్షేత్రస్థాయిలో మెరుగైన ఫలితాలను సాధించేలా చేస్తాయన్నారు.

నేటి ప్రపంచంలో సాంకేతికత అనేది సామాజిక, ఆర్థిక, రాజకీయ, విద్యా, పర్యావరణ మరియు భౌగోళిక-రాజకీయ కోణాలను కలిగి ఉందని రాష్ట్రపతి అన్నారు. ఇది నిరంతరం అభివృద్ధి చెందుతోందని మరియు ప్రతి రంగాన్ని ప్రభావితం చేస్తుందన్నారు. ఇంజనీర్లు వినూత్న సాంకేతికతలతో ప్రజల ప్రయోజనాల కోసం ముందుకు వస్తారని మరియు ప్రజల జీవన నాణ్యతను మెరుగుపరుస్తారని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. వెనుకబడిన వర్గాలు, సీనియర్ సిటిజన్లు, దివ్యాంగులు మరియు ప్రత్యేక మద్దతు అవసరమయ్యే ఇతర వ్యక్తుల కోసం పరిష్కారాల గురించి కూడా ఇంజనీరింగ్ విద్యార్థులు ఆలోచించాలని ఆమె అన్నారు.

ఇంజనీరింగ్ మరియు టెక్నాలజీలో మహిళల సహకారం గురించి రాష్ట్రపతి మాట్లాడుతూ, పెద్ద కంపెనీలకు నాయకత్వం వహిస్తున్న మరియు స్టార్టప్‌లను ప్రారంభించి, టెలికాం, ఐటీ, ఏవియేషన్, మెషిన్ డిజైన్, నిర్మాణ పనులు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి అన్ని రంగాల్లో ప్రముఖంగా సహకరిస్తున్న ఎందరో స్ఫూర్తిదాయకమైన మహిళల ఉదాహరణలు తమ వద్ద ఉన్నాయని రాష్ట్రపతి అన్నారు. సైన్స్ స్ట్రీమ్‌లను చేపట్టేందుకు మరింత మంది మహిళలు ముందుకు రావాల్సిన అవసరం ఉందని ఆమె ఉద్ఘాటించారు.

ఎస్టీఈఎం (STEM)- సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ మరియు గణితం అనేది భారత ఆర్థిక వ్యవస్థకు చాలా ముఖ్యమైనదని ఆమె అన్నారు. యువతులను సాంకేతిక నిపుణులుగా, ఆవిష్కర్తలుగా తీర్చిదిద్దడం ద్వారా దేశాన్ని పటిష్టమైన ఆర్థిక వ్యవస్థ వైపు నడిపించవచ్చని చెప్పారు. మహిళలు సాంకేతిక రంగాలలో విభిన్న దృక్కోణాన్ని మరియు నైపుణ్యాలను కలిగి ఉంటారని, మహిళల అభిజ్ఞా సామర్థ్యాలు వివిధ స్థాయిలలో జ్ఞానం మరియు సాంకేతికతలను గ్రహించే విధానాన్ని మార్చగలవని పేర్కొన్నారు. మహిళలు తమకు ఎదురయ్యే సవాళ్లను అధిగమించి కెరీర్‌లో ఎదగాలని ఆమె అన్నారు. విద్యార్థినులు సాధికారత సాధించి, ఇతరులకు కూడా సాధికారత కల్పించాలని రాష్ట్రపతి సూచించారు. కేవలం తమ విజయం, సంతోషాలతో సంతృప్తి చెందకూడదని అన్నారు. దేశం పట్ల మరియు మొత్తం మానవాళి పట్ల వారికి కర్తవ్యం ఉందని, వారు తమ ప్రతిభను మరియు సాంకేతిక సామర్థ్యాలను పెద్దస్థాయిలో మంచి కోసం ఉపయోగించాలన్నారు.

సాంకేతిక ప్రపంచంలోకి ప్రొఫెషనల్‌గా ప్రవేశించేందుకు అనేక మంది యువతులకు జి.నారాయణమ్మ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ ఫర్ ఉమెన్ సంస్థ అనేక అవకాశాలను కల్పించిందని రాష్ట్రపతి ప్రశంసించారు. అలాగే మహిళా దక్షతా సమితి మహిళలకు అన్ని విధాలా అండగా నిలుస్తోందని కొనియాడారు. సమితి ఆధ్వర్యంలోని కళాశాలలు నిరుపేద మహిళలకు అభివృద్ధి, సంరక్షణ, పోషణ మరియు సాధికారత కల్పిస్తున్నాయని రాష్ట్రపతి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర మంత్రి సత్యవతి రాథోడ్ కూడా పాల్గొన్నారు. మరోవైపు గురువారం సాయంత్రం శంషాబాద్‌లోని శ్రీరామనగరంలో ఉన్న సమతా మూర్తి (స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ) విగ్రహాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సందర్శిస్తారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen + four =