తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి ప్రభావం తగ్గుముఖం పట్టింది. కొత్తగా 987 కేసులు నమోదవడంతో జూన్ 29, మంగళవారం సాయంత్రం 5:30 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,22,593 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. కరోనా వలన మరో 7 మంది మరణించడంతో, రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 3651 కి పెరిగింది.
ఇక గత 24 గంటల్లో 1362 మంది కరోనా నుంచి కోలుకోగా, రికవరీ అయినవారి సంఖ్య 6,05,455 కు చేరుకుంది. ప్రస్తుతం 13,487 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. మరోవైపు మంగళవారం నాడు 1,21,236 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించడంతో మొత్తం పరీక్షల సంఖ్య 1,85,62,105 కు చేరగా, రాష్ట్రంలో ప్రతి పదిలక్షల జనాభాకు 4,98,713 పరీక్షలు నిర్వహించినట్టు పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ