టీ20 ప్రపంచ కప్-2021 యూఏఈ, ఒమన్ లో నిర్వహణ, ఐసీసీ ప్రకటన

2021 T20 World Cup, ICC announces the dates of T20 World Cup 2021, ICC confirms 2021 T20 World Cup moves out of India, ICC Men’s T20 World Cup 2021, ICC Men’s T20 World Cup 2021 to be held in UAE, Mango News, T20 World Cup, T20 World Cup 2021 to be held in UAE, T20 World Cup 2021 to be held in UAE Oman from OCT 17 to NOV 14, T20 World Cup 2021 to be held in UAE Oman from OCT 17 to NOV 14 ICC Announced Officially, T20 World Cup to be played in UAE and Oman, T20 World Cup-2021

టీ20 ప్రపంచ కప్-2021 అక్టోబర్ 17 నుండి నవంబర్ 14 వరకు యూఏఈ మరియు ఒమన్లలో జరుగుతుందని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) మంగళవారం నాడు అధికారికంగా ప్రకటించింది. ఈ టీ20 ప్రపంచ కప్ టోర్నమెంట్ భారత్ లో జరగాల్సి ఉండగా, కరోనా సెకండ్ వేవ్ పరిణామాల నేపథ్యంలో యూఏఈ మరియు ఒమన్లకు మార్చినట్టు పేర్కొన్నారు. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం, అబుదాబిలోని షేక్ జాయెద్ స్టేడియం, షార్జా స్టేడియం మరియు ఒమన్ క్రికెట్ అకాడమీ గ్రౌండ్ అనే నాలుగు వేదికలలో బీసీసీఐ ఈ టోర్నమెంట్ కు ఆతిథ్యమిస్తుందని పేర్కొన్నారు.

మొదటి రౌండ్ లో ఎనిమిది జట్లు (బంగ్లాదేశ్, శ్రీలంక, ఐర్లాండ్, నెదర్లాండ్స్, స్కాట్లాండ్, నమీబియా, ఒమన్, పాపువా న్యూ గినియా) రెండు గ్రూపులుగా విడిపోయి ఒమ‌న్‌, యూఏఈలో పోటీపడతాయని పేర్కొన్నారు. ప్రతి గ్రూప్ నుండి మొదటి రెండు జట్లు అనగా నాలుగు జట్లు సూపర్ 12కు ఎంపిక అవుతాయని, అక్కడ ఎనిమిది ఆటోమేటిక్ క్వాలిఫైయర్లతో చేరతారని చెప్పారు. ముందుగా దేశంలో కరోనా పరిస్థితుల దృష్ట్యా, అక్టోబర్, నవంబర్ మధ్య షెడ్యూల్ చేసిన టీ20 ప్రపంచ కప్‌ను యూఏఈకి మార్చాలని బీసీసీఐ నిర్ణయించింది. “ఈ టోర్నమెంట్ కు భారతదేశంలో సంతోషంగా ఆతిథ్యం ఇచ్చేవాళ్ళం, కానీ కరోనా పరిస్థితి మరియు ప్రపంచ కప్ యొక్క ప్రాముఖ్యత కారణంగా అనిశ్చితిని పరిగణనలోకి తీసుకుని, యూఏఈ మరియు ఒమన్లలో ఈ టోర్నమెంట్‌ను నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది” అని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen − 6 =