15వ ఆర్థిక సంఘానికి వైద్య ఆరోగ్యశాఖ తరపున పంపే ప్రతిపాదనలపై సీఎస్ సమీక్ష

Chief Secretary Somesh Kumar, Health Infrastructure, Health Infrastructure Initiatives, Health Infrastructure Initiatives In Telangana, Mango News, Review Meeting to Prepare Proposals on Health Infrastructure Initiatives, Somesh Kumar, Strengthen Primary health centres says CS Somesh Kumar, Telangana CS, Telangana CS Somesh Kumar, Telangana Somesh Kumar, Telangana Somesh Kumar held Review Meeting to Prepare Proposals on Health Infrastructure Initiatives, Telangana Somesh Kumar Review Meeting

15వ ఆర్థిక సంఘానికి వైద్య ఆరోగ్య శాఖ తరపున పంపే ప్రతిపాదనలపై మంగళవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఆధ్వర్యంలో ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాలు, ఏజెన్సీ ప్రాంతాల్లో మరింత మెరుగైన వైద్య, ఆరోగ్య సదుపాయాలను కల్పించేందుకు ప్రతిపాదనలను సిద్ధం చేయాలని అధికారులను సీఎస్ ఆదేశించారు. ప్రస్తుతం ఉన్న ఆరోగ్య ఉపకేంద్రాలను పటిష్ట పర్చడం, ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలలో కొన్నింటిని మండల పబ్లిక్ హెల్త్ యూనిట్ గా అభివృద్ధి చేయాలని సూచించారు. ఈ సమావేశంలో ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వి, మున్సిపల్ శాఖ కమీషనర్ డా.సత్యనారాయణ, వైద్య ఆరోగ్య శాఖ కమీషనర్ వాకాటి కరుణ, వైద్య శాఖ సంచాలకులు డా.శ్రీనివాస రావు, వైద్య విద్యాశాఖ సంచాలకులు రమేష్ రెడ్డి, ముఖ్యమంత్రి కార్యాలయం ఓ.ఎస్.డి గంగాధర్ తదితరులు హాజరయ్యారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 + three =