విజయవాడలో వాణిజ్య ఉత్సవ్‌-2021 కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్

CM YS Jagan Inaugurates Vanijya Utsav-2021 Programme, CM YS Jagan Inaugurates Vanijya Utsav-2021 Programme in Vijayawada, CM YS Jagan launches Vanijya Utsav 2021, Mango News, Vanijya Utsav Programme, Vanijya Utsav to boost trade and exports, Vanijya Utsav-2021 Programme, Vanijya Utsav-2021 Programme in Vijayawada, Vijayawada, YS Jagan Inaugurates Vanijya Utsav-2021, YS Jagan Inaugurates Vanijya Utsav-2021 Programme

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వాణిజ్య ఉత్సవ్‌-2021 పేరుతో సెప్టెంబర్ 21, 22న విజయవాడలో భారీ వాణిజ్య సదస్సును నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వాణిజ్య ఉత్సవ్‌-2021 కార్యక్రమాన్ని ప్రారంభించారు. అలాగే ఎగుమతులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ ప్రణాళికను, ఎగుమతుల వాణిజ్య పోర్టల్‌ను, వైఎస్సార్‌ వన్ వ్యాపార సలహా సేవలను సీఎం వైఎస్ జగన్ ప్రారంభించారు. వాణిజ్య ఉత్సవ్‌లో ఏర్పాటు చేసిన స్టాళ్లను సీఎం సందర్శించి, ఉత్పత్తులకు సంబంధించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ లో భాగంగా రాష్ట్రంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.

రాష్ట్ర ప్రభుత్వం, ప్లాస్టిక్‌ ఎక్స్‌పోర్ట్‌ ప్రమోషన్‌ కౌన్సిల్‌ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సదస్సు ముందుగా రాష్ట్రస్థాయిలో విజయవాడలోని ఎస్‌ఎస్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో రెండ్రోజులపాటు జరుగనుంది. అనంతరం రాష్ట్రవ్యాప్తంగా సెప్టెంబర్ 24 నుంచి 26 వరకు జిల్లాల వారీగా కలెక్టర్ల నేతృత్వంలో సదస్సులు జరుగుతాయి. పోర్టులు, లాజిస్టిక్, ఫుడ్‌ ప్రాసెసింగ్, నైపుణ్యం వంటి అంశాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి, రాష్ట్రం నుంచి ఎగుమతుల విలువను రెట్టింపు చేయటం లక్ష్యంగా పెట్టుకున్నారు. వాణిజ్య ఉత్సవ్‌లో ముఖ్యంగా ఫుడ్‌ ప్రాసెసింగ్‌ ఎగుమతుల అవకాశాలపై చర్చించనున్నారు. ఇప్పటికే పార్లమెంట్‌ నియోజకవర్గాల పరిధిలో మొత్తం 2వేల 900 కోట్లతో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. ఈ సదస్సులో విదేశీ రాయబారులతోపాటు 100 మందికి పైగా ఎగుమతిదారులు పాల్గొననున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

17 − two =