జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు పుట్టినరోజు సందర్భంగా ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెల్లువ

Tollywood Celebrities Politicians Greet Jansena President Power Star Pawan Kalyan on his Birthday, PawanKalyan Celebrity Birthday Wishes , Happy Birthday Pawan Kalyan, Tollywood Celebs Wishes Pawan Kalyan, Mango News, Mango News Telugu, Pawan Kalyan Birthday Latest News And Updates, Happy Birthday Power Star Pawan kalyan , Politicians Greet Jansenani, Power Star Pawan Kalyan on His Birthday, Power Star Pawan kalyan, Happy Birthday PSPK, PSPK News And Live Updates

ప్రముఖ సినీనటుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు (సెప్టెంబర్ 2) నేడు. ఈ నేపథ్యంలో పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియా వేదికగా పవన్ కళ్యాణ్ కు ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు, నిర్మాతలు, దర్శకులు, నటీనటులు పవన్ కళ్యాణ్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇక లక్షలాది అభిమానులు ట్వీట్లు, సెలెబ్రేషన్స్ వీడియోలు పోస్టు చేస్తూ సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు.

మరోవైపు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఆయన కెరీర్ లో అద్భుత విజయాలు సాధించిన తమ్ముడు, జల్సా సినిమాల స్పెషల్ షోస్ ను సెప్టెంబర్ 1, 2 తేదీల్లో అభిమానులు తెలుగు రాష్ట్రాలతో పాటుగా ప్రపంచవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో నిర్వహించి పండగ వాతావరణాన్ని, జాతరను తలిపించేలా సంబరాలు జరుపుకున్నారు. అలాగే “నాసేన కోసం, నావంతు” కార్యక్రమంలో భాగంగా అభిమానులు, జనసైనికులు, వీరమహిళలు పార్టీకి పెద్దఎత్తున విరాళాలు అందించడంతో పాటుగా, రెండు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో అభిమానులు పెద్దఎత్తున సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు.

ఇక జాగర్లమూడి క్రిష్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ ‘హరి హర వీర మల్లు’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. పవన్ పుట్టిన రోజు సందర్భంగా హరి హర వీర మల్లు పవర్ గ్లాన్స్ ను చిత్ర యూనిట్ ఈ రోజు విడుదల చేసింది. పవన్ కళ్యాణ్ సరికొత్త పాత్రలో పవర్ గ్లాన్స్ విశేషంగా ఆకట్టుకోవడంతో అభిమానుల్లో ఉత్సాహాం మరింత రెట్టింపైంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × 4 =