బెంగళూరు: ప్రముఖ మురుఘ మఠాధిపతి శివమూర్తి స్వామి అరెస్ట్‌, జ్యూడిషియల్ కస్టడీకి తరలింపు

Karnataka Well Known Murugha Mutt Chief Pontiff Shivamurthy Swami Arrested Sent To Judicial Custody, Karnataka seer Shivamurthy hospitalised , Lingayat mutt seer Shivamurthy Murugha Sharanaru, Karnataka seer Shivamurthy Swami, Shivamurthy Murugha Sharanaru arrested, Mango News, Mango News Telugu, Karnataka seer Shivamurthy Swami,Shivamurthy Swami Sexual abuse case, Shivamurthy Sharanaru Latest News And Updates, Murugha Mutt Chief Pontiff Shivamurthy Swam

కర్ణాటక రాష్ట్రంలో సంచలనం సృష్టించిన పోక్సో కేసులో ప్రముఖ చిత్రదుర్గ మురుఘ మఠాధిపతి రాజేంద్ర శివమూర్తి స్వామిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ మేరకు గురువారం రాత్రి మురుఘ రాజేంద్ర మఠంలో భారీ బందోబస్తు మధ్య పోలీసులు ఆయనను అరెస్ట్‌ చేసి వైద్య పరీక్షలకు తరలించారు. కాగా ఆగస్టు 26వ తేదీన చిత్రదుర్గలోని మురఘశ్రీ హాస్టల్‌లో చదువుకుంటున్న ఇద్దరు మైనర్‌ విద్యార్థినులు స్వామీజీపై తమపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపించడం కలకలం రేపింది. విద్యార్థినుల ఫిర్యాదు మేరకు మైసూరు నజరాబాద్‌ పోలీసులు శివమూర్తి స్వామిపై పోక్సో, ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే స్వామీజిని అరెస్ట్ చేసిన పోలీసులు చిత్రదుర్గలోని ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం 14 రోజుల జ్యూడిషియల్ కస్టడీకి పంపించారు.

ఇక మఠం ఆధ్వర్యంలో నిర్వహింపబడుతున్న పాఠశాల హాస్టల్‌లో ఉన్న ఇద్దరు బాలికలపై సాక్షాత్తూ మఠాధిపతి అత్యాచారం చేశారనే వార్త గత వారం రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతోంది. కాగా ఈ కేసులో మఠాధిపతితో పాటు హాస్టల్ వార్డెన్‌, మరో ముగ్గురు నిందితులుగా ఉన్నారు. వీరందరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే స్వామీజీ ముందస్తు బెయిల్‌ కోసం జిల్లా కోర్టులో చేసుకున్న పిటీషన్ పై విచారణ శుక్రవారానికి వాయిదా పడింది. మరోవైపు ఇప్పటికే జడ్జి ముందు బాలికలు వాంగ్మూలం ఇచ్చారు. దీంతో గురువారం రాత్రి పలు నాటకీయ పరిణామాల మధ్య పోలీసులు స్వామీజీని అరెస్ట్‌ చేశారు. బాధిత బాలికలను ప్రభుత్వ హాస్టల్‌కు తరలించిన పోలీసులు చిత్రదుర్గలో భద్రతను కట్టుదిట్టం చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen − seven =