సూపర్‌స్టార్ మహేష్ బాబుకి పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు వెల్లువ

Tollywood celebrities poured in birthday greetings For Super Star Mahesh Babu, Tollywood Celebrities Politicians Greet Super Star Mahesh Babu on his Birthday, Politicians Greet Super Star Mahesh Babu on his Birthday, Tollywood Celebrities Greet Super Star Mahesh Babu on his Birthday, Latest Telugu Movies News, Telugu Film News 2022, Tollywood Movie Updates, Tollywood Latest News, Super Star Mahesh Babu Birthday, Mahesh Babu Birthday, Mahesh Babu Pokiri Movie Special Show, Pokiri Movie Special Show, mahesh Babu Fans, Mahesh Babu Pokiri Movie Special Show on His Birthday, Tollywood Celebrities Wishes Mahesh Babu on His Birthday, Super Star Mahesh Babu, Mahesh Babu, Mango News, Mango News Telugu,

ప్రముఖ సినీనటుడు, సూపర్‌స్టార్ మహేష్ బాబు ఈరోజు 47వ పుట్టినరోజు జ‌రుపుకుంటున్నారు. ఈ సందర్భంగా మహేష్ బాబుకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. సోషల్ మీడియా ద్వారా పలు పరిశ్రమల సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు పెద్ద ఎత్తున మహేష్ బాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి, వెంకటేష్, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, జూ ఎన్టీఆర్ సహా పలువురు నటీనటులు మరియు తెలంగాణ ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీఆర్, సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ సహా పలువురు రాజకీయ ప్రముఖులు మహేష్ బాబుకు శుభాకాంక్షలు తెలియజేశారు.

మరోవైపు మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఆయన కెరీర్ లో సంచలన విజయాలు సాధించిన పోకిరి, ఒక్కడు సినిమాల స్పెషల్ షోస్ ను అభిమానులు తెలుగు రాష్ట్రాలతో పాటుగా ప్రపంచవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో నిర్వహిస్తూ సంబరాలు జరుపుకుంటున్నారు. ఈ షోస్ ద్వారా వచ్చిన డబ్బును మహేష్ బాబు (ఎంబీ) ఫౌండేషన్ ద్వారా చిన్న పిల్లల గుండె ఆపరేషన్‌, పేద పిల్లల విద్యకు విరాళంగా ఇవ్వాలని అభిమానులు, సంబంధిత డిస్ట్రిబ్యూటర్స్ నిర్ణయం తీసుకున్నారు. అలాగే రెండు తెలుగు రాష్ట్రాల్లో మహేష్ బాబు అభిమానులు వేడుకలతో పాటుగా పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen − twelve =