తెలంగాణ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన అధికార టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రత్యేక దర్యాప్తు సంస్థ (సిట్) నోటీసులు అందుకున్న తుషార్‌కు ఉపశమనం కలిగింది. తుషార్‌ను అరెస్ట్ చేయొద్దంటూ హైకోర్టు సిట్‌కు సూచించింది. అలాగే సిట్ విచారణకు తుషార్ సహకరించాలని స్పష్టం చేసింది. విచారణ సందర్భంగా తుషార్ తరపు న్యాయవాది వాదిస్తూ.. సిట్ అధికారులు తుషార్‌కు 41ఏ సీఆర్పీసీ కింద సమన్లు ఇచ్చారని, అయితే ఆయనను నిందితుల జాబితాలో చేర్చారని అన్నారు. అలాగే దీనిపై సరైన వివరణ ఇవ్వకుండా లుకౌట్ నోటీసులు ఎలా జారీ చేస్తారని ప్రశ్నించారు. దీనిపై స్పందించిన న్యాయస్థానం తుషార్‌ను అరెస్ట్ చేయొద్దని సిట్‌కు ఆదేశాలు ఇచ్చింది. కాగా ఇదే కేసులో ఇంతకుముందు బీజేపీ జాతీయ కార్యదర్శి బీఎల్ సంతోష్ కు కూడా ఉపశమనం కల్గిస్తూ, ఆయనను అరెస్ట్ చేయవద్దని కోర్టు సూచించిన విషయం తెలిసిందే.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE