చైనా మాజీ అధ్యక్షుడు జియాంగ్ జెమిన్ కన్నుమూత

Former Chinese President Jiang Zemin Dies at 96,Former Chinese President Jiang Zemin,Jiang Zemin Dies at 96,Jiang Zemin Former Chinese President,Mango News,Mango News Telugu,Jiang Zemin Latest News And Updates,Former Chinese President Died,Former Chinese President Dies,Former Chinese President Jiang,Former Chinese President Zemin,Jiang Zemin News And Live Updates,Chinese,Chinese President,Former Chinese President News And Updates

చైనా మాజీ అధ్యక్షుడు జియాంగ్ జెమిన్ కన్నుమూశారు. 96 ఏళ్ల జియాంగ్ జెమిన్ అనారోగ్య కారణాలతో షాంఘైలోని తన ఇంట్లో బుధవారం తుదిశ్వాస విడిచినట్టుగా ఆ దేశ మీడియా సంస్థలు వెల్లడించాయి. అలాగే జియాంగ్ జెమిన్ మరణాన్ని పాలక కమ్యూనిస్ట్ పార్టీ, పార్లమెంట్, కేబినెట్ మరియు సైన్యం కూడా ధ్రువీకరిస్తూ లేఖ విడుదల చేశాయి. జియాంగ్ మరణం పార్టీకి, సైన్యానికి మరియు దేశంలోని అన్ని జాతుల ప్రజలకు పూడ్చలేని లోటని లేఖలో పేర్కొన్నారు. చైనా అభివృద్ధికి దారితీసిన ఆర్థిక సంస్కరణల చేపట్టడం, మద్దతు ఇవ్వడంతో జియాంగ్‌ జెమిన్‌ ప్రత్యేక గుర్తింపు పొందాడు.

1989 టియానన్మెన్ అణిచివేత తర్వాత విభజించబడిన కమ్యూనిస్ట్ పార్టీకి నాయకత్వం వహించిన జియాంగ్ జెమిన్, అనంతరం అధ్యక్షుడిగా చైనాను ఎంతగానో అభివృద్ధి చేశాడు. పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా యొక్క 5వ అధ్యక్షుడుగా 1993 మార్చి 27 నుంచి 2003 మార్చి 15 వరకు పనిచేశారు. అలాగే జియాంగ్ జెమిన్ 1989 నుంచి 2002 వరకు 13 ఏళ్ల పాటు చైనీస్ కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శిగా, 1989 నుండి 2004 వరకు సెంట్రల్ మిలిటరీ కమిషన్ ఛైర్మన్‌గా కూడా ఉన్నారు. చైనా ప్రపంచ ఆర్థిక శక్తిగా ఎదగడానికి మార్గనిర్దేశం చేయడంతో పాటుగా, దేశానికి విదేశీ పెట్టుబడులను తీసుకురావడంలో జియాంగ్ జెమిన్ కీలక పాత్ర పోషించాడు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 + fifteen =