రాష్ట్ర సాధనకు ‘తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో’ అంటూ ప్రాణాలను పణంగా పెట్టిన చారిత్రాత్మక రోజు నేడు – ఎమ్మెల్సీ కవిత

TRS MLC Kavitha Remembers This Day as 13 years Ago CM KCR Began Fast Until Death to Achieve Statehood For Telangana,TRS MLC Kavitha,13 years Ago CM KCR Began Fast, KCR Began Fast For Telangana on This Day,Statehood For Telangana,Mango News,Mango News Telugu,CM KCR News And Live Updates, Telangna Congress Party, Telangna BJP Party, YSRTP,TRS Party, BRS Party, Telangana Latest News And Updates,Telangana Politics, Telangana Political News And Updates,Telangana Minister KTR

కోట్లాది ప్రజల ఆకాంక్షను నెరవేర్చేందుకు, ‘తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో’ అంటూ ప్రాణాలను పణంగా పెట్టి, సమైక్య పాలకుల నిర్బంధాలను ఛేదించి, ‌సిద్దిపేట కేంద్రంగా ఉద్యమ వీరుడు కేసీఆర్ గారు ఆమరణ నిరాహారదీక్ష ప్రారంభించిన చారిత్రాత్మక రోజు నవంబర్ 29 అని గుర్తు చేసుకున్నారు, సీఎం కేసీఆర్ కుమార్తె,  టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. నవంబర్ 29, 2009లో టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షకు నేటితో 13 సంవత్సరాలు పూర్తి అయ్యాయి. ఈ సందర్భంగా ఆమె ట్విట్టర్ వేదికగా నాటి స్మృతులను పంచుకున్నారు. ‘ఆనాటి ఆమరణ నిరాహారదీక్ష స్పూర్తితో, స్వరాష్ట్రం తెలంగాణలో సీఎం కేసీఆర్ గారి సారధ్యంలో, సర్కారు సంక్షేమ, అభివృద్ధి ఫలాలతో సబ్బండ వర్ణాలు సగర్వంగా, సంతోషంగా ఉన్నారు. రాష్ట్రం అన్నింటా అగ్రగామిగా నిలుస్తూ, దేశానికే ఆదర్శంగా నిలుస్తోంది’ అని పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twelve + two =