జూలై 1న టీఎస్ టెట్-2022 ఫలితాలు విడుదల

TS Education Minister Sabitha Indra Reddy Orders Officials to Release TSTET-2022 Results on July 1st, Education Minister Sabitha Indra Reddy Orders Officials to Release TSTET-2022 Results on July 1st, Telangana Education Minister Sabitha Indra Reddy Orders Officials to Release TSTET-2022 Results on July 1st, Minister Sabitha Indra Reddy Orders Officials to Release TSTET-2022 Results on July 1st, Sabitha Indra Reddy Orders Officials to Release TSTET-2022 Results on July 1st, TSTET-2022 Results on July 1st, TSTET-2022 Results, 2022 TSTET Results on July 1st, TSTET Results on July 1st, Telangana Education Minister Sabitha Indra Reddy, TS Education Minister Sabitha Indra Reddy, Education Minister Sabitha Indra Reddy, Sabitha Indra Reddy, TSTET-2022 Results News, TSTET-2022 Results Latest News, TSTET-2022 Results Latest Updates, TSTET-2022 Results Live Updates, Mango News, Mango News Telugu,

తెలంగాణ రాష్ట్రంలో టీచర్స్‌ ఎలిజిబిలిటీ టెస్ట్/ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌)-2022 ను జూన్ 12న నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీఎస్ టెట్-2022 ఫలితాలను జూలై 1వ తేదీన విడుద‌ల చేయాల‌ని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి సంబంధిత అధికారుల‌ను ఆదేశించారు. ముందుగా టెట్ నోటిఫికేషన్ లో జూన్ 27వ తేదీనే ఫలితాలను విడుదల చేయనున్నట్టు పేర్కొన్నారు. కాగా ఫ‌లితాల వెల్ల‌డిపై జూన్ 27న ఎలాంటి ప్రకటన రాకపోవడంతో టెట్ అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు.

ఈ క్రమంలో మంగళవారం నాడు తన కార్యాలయంలో విద్యాశాఖ పనితీరుపై మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ స‌మావేశంలో ప్రభుత్వ కార్య‌ద‌ర్శి వాకాటి కరుణ‌, విద్యాశాఖ సంచాల‌కులు దేవ‌సేన‌, ఎస్ఈఆర్‌టీ డైరెక్ట‌ర్ రాధారెడ్డి, ప్ర‌భుత్వ ప‌రీక్ష‌ల సంచాల‌కులు కృష్ణారావు, త‌దిత‌రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, టెట్ ఫ‌లితాల వెల్ల‌డిలో జాప్యానికి ఆస్కారం లేకుండా జూలై 1న విడుద‌ల చేయాల‌ని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. మరోవైపు టెట్-2022 పరీక్షల నిర్వహణ అనంతరం ఇప్పటికే ప్రైమరీ కీ ని విడుదల చేసి, అభ్యంతరాలను కూడా స్వీకరించారు. అయితే ఫైనల్ కీ విడుదలపై స్పష్టత రావాల్సి ఉంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here