తెలంగాణలో పోలీస్ ఉద్యోగాలకు దరఖాస్తు గడువు మే 26 వరకు పొడిగింపు

TS Police Recruitment 2022 The Last Date for Receipt of Applications is Extended till 26th May, The Last Date for Receipt of Applications is Extended till 26th May, 26th May is The Last Date For Job Applications of TS Police Recruitment 2022, 26th May Is The Last Date For Job Applications of TS Police Recruitment 2022, TS Police Recruitment 2022, 2022 TS Police Recruitment, Last Date For Job Applications Is 26th May, Telangana State Level Police Recruitment Board, TSLPRB will close down the application process for TS Police Recruitment 2022 on 26th May, TSLPRB Says 26th May is The Last Date For Job Applications of TS Police Recruitment 2022, Telangana State Level Police Recruitment Board Says 26th May is The Last Date For Job Applications of TS Police Recruitment 2022, Telangana Police Recruitment 2022, 26th May is The Last Date For Job Application Of Police Recruitment, TS Police Recruitment News, TS Police Recruitment Latest News, TS Police Recruitment Latest Updates, TS Police Recruitment Live Updates, Mango News, Mango News Telugu,

రాష్ట్రంలో పోలీస్ ఉద్యోగాలకు సంబంధించి దరఖాస్తు గడువును మే 26 వరకు పొడిగిస్తునట్టు తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (టీఎస్‌ఎల్‌పీఆర్బీ) ప్రకటించింది. రాష్ట్రంలో 16,614 పోలీసు ఉద్యోగాల‌కు (ఎస్ఐ, కానిస్టేబుల్) మరియు ఎక్సైజ్, ర‌వాణా శాఖ‌ల్లో 677 కానిస్టేబుల్ ఉద్యోగాల‌కు కలిపి మొత్తం మొత్తం 17,291 పోస్టుల భర్తీకి ఇటీవలే టీఎస్‌ఎల్‌పీఆర్బీ నోటిఫికేషన్స్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ పోస్టులకు www.tslprb.in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచిన ప్రొఫార్మాలో మే 2వ తేదీ నుండి దరఖాస్తు స్వీకరణ ప్రారంభం కాగా, దరఖాస్తు గడువు మే 20, శుక్రవారం రాత్రి 10 గంటలకు ముగియనున్నట్టు ముందుగా ప్రకటించారు. అయితే పోలీసు శాఖ ఉద్యోగ నియామకాల్లో అభ్యర్థుల వయోపరిమితిని మరో రెండు సంవత్సరాలు పొడిగిస్తూ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శుక్రవారం నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం గరిష్ట వయోపరిమితిని 2 సంవత్సరాలు పెంచిన నేపథ్యంలో దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ మే 26, 2022 వరకు రాత్రి 10 గంటల వరకు పొడిగించబడిందని టీఎస్‌ఎల్‌పీఆర్బీ తాజాగా ప్రకటించింది.

మరోవైపు పోలీస్, ఫైర్ సర్వీసెస్, జైళ్లు, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్, ట్రాన్స్‌పోర్ట్ అండ్ ప్రొహిబిషన్, ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్స్ వంటి యూనిఫామ్ సర్వీస్ కు తెలంగాణ ప్రభుత్వం గరిష్ట వయోపరిమితిని 2 సంవత్సరాలు పెంచడంతో 17,291 పోస్టుల భర్తీకి సంబంధించి టీఎస్‌ఎల్‌పీఆర్బీ జారీచేసిన 6 నోటిఫికేషన్‌లలో పేర్కొన్న గరిష్ట వయోపరిమితికి అదనంగా ఈ సడలింపు ఉంటుందని పేర్కొన్నారు. ఓవైపు వయోపరిమితి పెంపు, మరోవైపు దరఖాస్తు గడువు కూడా పెంచడంతో పోలీస్ ఉద్యోగాల కోసం పోటీపడుతున్న అభ్యర్ధులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త అందించినట్టయింది.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here