విద్యుత్‌ కనెక్షన్‌పై పేరును ఇకపై వారం రోజుల్లో ఆన్‌లైన్‌లోనే మార్చుకోవచ్చు – టీఎస్‌పీడీసీఎల్‌ సీఎండీ రఘుమారెడ్డి

TSPDCL CMD Raghuma Reddy Announces The Title Transfer of Electricity Connection Became More Easy Now, Title Transfer of Electricity Connection, TSPDCL Title Transfer of Electricity, TSPDCL CMD Raghuma Reddy,Mango News,Mango News Telugu, TSPDCL CMD Raghuma Reddy, CMD Raghuma Reddy, Telangana State Southern Power Distribution, Electric Power Distribution Company, Southern Power Distribution Company, New Service Registrations,TS Transco, TS Genco, TSSPDCL, TS ERC ,TSNPDCL

తెలంగాణ రాష్ట్ర దక్షిణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్‌పీడీసీఎల్‌) వినియోగదారులకు కీలక అప్‌డేట్ ఇచ్చింది. రాష్ట్రంలో విద్యుత్‌ సర్వీస్‌ కనెక్షన్ల యాజమాన్య హక్కుల బదలాయింపు (టైటిల్‌ ట్రాన్స్‌ఫర్‌) ప్రక్రియను సులభతరం చేసినట్లు తెలిపింది. ఈ మేరకు టీఎస్‌పీడీసీఎల్‌ సీఎండీ రఘుమారెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. దీనికోసం వినియోగదారులు ఇకపై విద్యుత్ ఆఫీసుల చుట్టూ తిరగనక్కరలేదని, ఇంట్లో కూర్చునే ఆన్‌లైన్‌లో ఈ మొత్తం ప్రక్రియను పూర్తి చేయొచ్చని ఆయన తెలిపారు. అలాగే దీనికి కేవలం వారం రోజుల సమయం మాత్రమే పడుతుందని ఆయన వెల్లడించారు. ఇక ఆన్‌లైన్‌లో దరఖాస్తు కోసం www.tssouthernpower.comలో కానీ, లేదా ఇంటిగ్రేటెడ్‌ కస్టమర్‌ సర్వీస్‌ సెంటర్‌/కస్టమర్‌ సర్వీస్‌ సెంటర్‌లో కానీ సంప్రదించాలని రఘుమారెడ్డి దరఖాస్తుదారులకు సూచించారు.

గృహ కనెక్షన్‌ (కేటగిరీ -1)కు సంబంధించిన టైటిల్‌ ట్రాన్స్‌ఫర్‌ చేయాలనుకునేవారు అందించాల్సిన పత్రాలు-

  • దరఖాస్తుదారుని ఏదేని గుర్తింపు కార్డు,
  • రూ.100 నాన్‌ జుడీషియల్‌ స్టాంప్‌ పేపర్‌పై ధ్రువీకరణ,
  • ప్రస్తుత దరఖాస్తుదారుని పేరు మీద స్వీయ ధ్రువీకరణ (లేదా),
  • రిజిస్టర్డ్‌ డీడ్‌, విల్‌ డీడ్‌ వంటి ఏదైనా యాజమాన్య హక్కు ధ్రువీకరణ పత్రం సమర్పించాలి.

గృహేతర కనెక్షన్‌ (కేటగిరీ-2)కు సంబంధించిన టైటిల్‌ ట్రాన్స్‌ఫర్‌ చేయాలనుకునేవారు అందించాల్సిన పత్రాలు-

  • కంపెనీ అధికార పత్రం,
  • ఉమ్మడి యాజమాన్యం ఉంటే రూ.10 నాన్‌ జుడీషియల్‌ స్టాంప్‌ పేపర్‌పై ఒప్పందం,
  • పాత యజమాని చనిపోతే లీగల్‌ హెయిర్‌ సర్టిఫికేట్‌ సమర్పించాలి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eight − one =