సంక్రాంతి పండగ సందర్భంగా తెలంగాణలోని వివిధ ప్రాంతాలతో పాటుగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక బస్సులు నడిపేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) ప్రణాళిక సిద్ధం చేసింది. సంక్రాంతి సందర్భంగా సొంతూళ్లకు వెళ్లే ప్రజల కోసం టీఎస్ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోందని, ప్రజలను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చేందుకు 4,233 ప్రత్యేక బస్సులను నడపాలని నిర్ణయించిందని టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలో సంక్రాంతికి ప్రత్యేక బస్సుల ఏర్పాట్లపై హైదరాబాద్ లోని బస్‌భవన్‌లో గురువారం వీసీసజ్జనార్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సంక్రాంతి పండుగకు నడిచే ప్రత్యేక బస్సు సర్వీసుల ఛార్జీల్లో ఎలాంటి చార్జీల పెంపు ఉండదని, సాధారణ ఛార్జీలతోనే నడుపుతున్నట్లు స్పష్టం చేశారు. సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులు రానుపోనూ ఒకేసారి టికెట్లు బుకింగ్ చేసుకుంటే, తిరుగు ప్రయాణంపై 10 శాతం రాయితీని టీఎస్ఆర్టీసీ కల్పిస్తుందన్నారు. జనవరి 31,2023 వరకు ఈ రాయితీ అమల్లో ఉంటుందని, ప్రయాణికులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని కోరారు.
సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే ప్రజల కోసం హైదరాబాద్ నగరం నుంచి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు మరియు ఏపీకి మొత్తం 4,233 ప్రత్యేక బస్సులు నడపాలని నిర్ణయించినట్లు వీసీ సజ్జనార్ తెలిపారు. ఇందులో 585 సర్వీసులకు అడ్వాన్స్డ్ బుకింగ్ సౌకర్యం కూడా కల్పిస్తున్నామని, www.tsrtconline.in వెబ్ సైట్ ద్వారా ప్రజలు టికెట్స్ బుక్ చేసుకోవచ్చని చెప్పారు. ప్రయాణికుల రద్దీ డిమాండ్ కు అనుగుణంగా జనవరి 7 వ తేదీ నుంచి జనవరి 14 వరకు ఈ ప్రత్యేక బస్సులు నడపనున్నట్టు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లోని అమలాపురానికి 125, కాకినాడకు 117, కందుకూరుకు 83, విశాఖపట్నంకు 65, పోలవరంకు 51, రాజమండ్రికి 40, రాజోలుకు 20, ఉదయగిరికి 18, నెల్లూరుకు 20, నర్సాపురంకు 14 బస్సులు నడుపుతున్నట్లు తెలిపారు. జనవరి 11 నుంచి 14 వరకు ఎంజీబీఎస్, జూబ్లీ బస్ స్టేషన్ తో పాటుగా కేపీహెచ్‌బీ, ఉప్పల్ క్రాస్ రోడ్, గచ్చిబౌలి, ఎల్బీనగర్ క్రాస్ రోడ్స్ వంటి ప్రధాన బస్ స్టాఫ్ ల నుంచి కూడా ప్రత్యేక బస్సులను వివిధ ప్రాంతాలకు నడపనున్నట్టు తెలిపారు. అదే విధంగా సంక్రాంతి పండుగ అనంతరం ఏపీ నుంచి తిరుగు ప్రయాణమయ్యే ప్రజల కోసం జనవరి 16 నుంచి 18 వరకు మరో 212 ప్రత్యేక బస్సులను టీఎస్ఆర్టీసీ నడపనుందని పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE