ఎల్‌.రమణకు పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని అందజేసిన టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

, Mango News, Minister KTR, Ruling Government, Telangana CM KCR, Telangana President L Ramana, Telangana President L Ramana To Join Ruling Government, TRS Invites TDP Telangana President L Ramana, TRS Invites TDP Telangana President L Ramana Join Ruling Government, TRS Party Primary Membership, TRS Party Primary Membership From Minister KTR, TTDP Former President L Ramana, TTDP Former President L Ramana Takes TRS Party Primary Membership, TTDP Former President L Ramana Takes TRS Party Primary Membership From Minister KTR

తెలంగాణ టీడీపీ మాజీ అధ్యక్షుడు, సీనియర్ నేత ఎల్‌.రమణ సోమవారం నాడు తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పార్టీలో చేరారు. తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స‌మ‌క్షంలో ఎల్.ర‌మ‌ణ టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సంద‌ర్భంగా ఎల్.రమణను కేటీఆర్ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించి, టీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని అందజేశారు. ఈ కార్య‌క్ర‌మంలో రాష్ట్ర మంత్రులు కొప్పుల ఈశ్వ‌ర్, గంగుల క‌మ‌లాక‌ర్‌, మల్లారెడ్డి సహా పలువురు ఉమ్మ‌డి క‌రీంన‌గ‌ర్ జిల్లాకు చెందిన టీఆర్ఎస్ నాయ‌కులు పాల్గొని ఎల్.ర‌మ‌ణకు శుభాకాంక్షలు తెలిపారు.

మరోవైపు జూలై 9న తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్య‌క్ష ప‌ద‌వికి ఎల్.ర‌మ‌ణ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. తెలంగాణ‌లో మారుతున్న రాజ‌కీయ స‌మీక‌ర‌ణాల నేప‌థ్యంలో ప్ర‌జ‌ల‌కు మ‌రింత చేరువ‌గా, రాష్ట్ర ప్ర‌గ‌తిలో భాగ‌స్వామ్యం కావాల‌నే భావ‌న‌తో టీఆర్ఎస్ పార్టీలో చేరాల‌ని నిర్ణ‌యించుకున్నానని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుకు రాసిన లేఖలో ఎల్.ర‌మ‌ణ పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twelve + 18 =