వీటీజీసెట్-2023 ప్ర‌వేశ‌ప‌రీక్ష‌ ద‌ర‌ఖాస్తు గ‌డువు పొడిగింపు

VTGCET-2023: Last Date for Submission of Online Applications Extended From March 6 to March 16th,VTGCET-2023,VTGCET Last Date for Submission,VTGCET Online Applications, VTGCET Extended From March 6 to March 16th,Mango News,Mango News Telugu,VTGCET Latest News,VTGCET Updates,VTGCET Last Date,VTGCET Exam,VTGCET Online Apply,VTGCET Online Application,VTGCET Online Application Latest News and Updates

తెలంగాణ రాష్ట్రంలోని గురుకులాల్లో ఐదో తరగతి ప్రవేశాల కోసం నిర్వహించే వీటీజీసెట్-2023 (తెలంగాణ గురుకుల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్) దరఖాస్తు గడువును పొడిగించారు. గతంలో ఈ ప్రవేశ పరీక్ష కోసం ఆన్‌లైన్ దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ 2023, మార్ఛి 6గా నిర్ణయించగా, తాజాగా ఆ గడువును 2023, మార్చి 16వ తేదీ వరకు పొడిగిస్తునట్టు ప్రకటించారు. ఈ మేరకు వీటీజీసెట్ చీఫ్ కన్వీనర్ రోనాల్డ్ రోస్ సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. విద్యార్థులు/అభ్యర్థులు ఆన్‌లైన్ దరఖాస్తుల సమర్పణ కోసం www.tswreis.in, http:/tgcet.cgg.gov.in, http:/mjptbcwreis.telangana.gov.in, http:/tgtwgurukulam.telangana.gov.in వంటి వెబ్‌సైట్‌లను సందర్శించాలని సూచించారు.

మరోవైపు వీటీజీసెట్-2023 ప్రవేశ పరీక్ష ఏప్రిల్ 23వ తేదీ ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 1 గంటల వరకు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా నిర్దేశించిన కేంద్రాలలో నిర్వహించనున్నారు. 2023-2024 విద్యా సంవత్సరానికి గానూ రాష్ట్రంలోని సోషల్, ట్రైబల్, బీసీ మరియు జనరల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్లలో 5వ తరగతిలో ప్రవేశాల కోసం వీటీజీసెట్-2023 నిర్వహిస్తున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty + five =