ఆంధ్రప్రదేశ్ లో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం 3 గంటల వరకు 53.57 శాతం పోలింగ్ నమోదయినట్టు ఎన్నికల అధికారులు వెల్లడించారు. ఇప్పటివరకు ప్రకాశంలో అత్యధికంగా 64.31 శాతం పోలింగ్ నమోదైంది.
3 గంటలవరకు జిల్లాల వారీగా పోలింగ్ వివరాలు:
- ప్రకాశం : 64.31 %
- నెల్లూరు : 61.03 %
- శ్రీకాకుళం : 59.9 %
- అనంతపురం : 56.93 %
- కడప : 56.63 %
- గుంటూరు : 54.42 %
- చిత్తూరు : 54.12 %
- పశ్చిమ గోదావరి : 53.68 %
- విజయనగరం : 53.31 %
- తూర్పుగోదావరి : 53.08 %
- కృష్ణా : 52.87 %
- కర్నూలు : 48.87 %
- విశాఖపట్నం : 47.86 %
- విజయనగరం మహారాజా కళాశాలలోని పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్న రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ.
- తాడిపత్రి పట్టణంలో మున్సిపల్ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న జేసీ పవన్ కుమార్ రెడ్డి.
- హిందూపురంలో ఓటు హక్కు వినియోగించుకున్న ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ దంపతులు.
- నగరిలో ఓటు హక్కు వినియోగించుకున్న ఎమ్మెల్యే రోజా.
- భీమిలి నేరెళ్లవలసలో ఓటు హక్కు వినియోగించుకున్న రాష్ట్ర పర్యాటక శాఖ అవంతి శ్రీనివాస్.
- విజయవాడలో ఓటు హక్కు వినియోగించుకున్న టీడీపీ ఎంపీ కేశినేని నాని.
- ఏపీలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా 1 గంటవరకు 42.84 శాతం పోలింగ్ నమోదయినట్టు ఎన్నికల అధికారులు వెల్లడించారు. ముఖ్యంగా ఇప్పటివరకు ప్రకాశంలో అత్యధికంగా 53.19 శాతం, తూర్పుగోదావరి జిల్లాలో 53.08, నెల్లూరులో 48.89, కడపలో 46.02, పశ్చిమ గోదావరిలో 45.51, అనంతపురంలో 45.42, విజయనగరంలో 45.10, గుంటూరులో 44.69, శ్రీకాకుళంలో 44.38, కృష్ణాలో 41.51 శాతం నమోదయింది. ఓటు హక్కు వినియోగించుకుందుకు ఉదయం నుంచే ప్రజలు పెద్దసంఖ్యలో పోలింగ్ కేంద్రాల వద్దకు చేరుకోవడంతో పోలింగ్ శాతం భారీగా నమోదయ్యే అవకాశం ఉంది.
- ఓటు హక్కును వినియోగించుకున్న ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ దంపతులు. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా రాష్ట్రంలో తొలిసారిగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాజ్‌భవన్ సమీపంలో ఉన్న సీవీఆర్‌జీఎంసీ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో గవర్నర్ దంపతులు ఓటు వేశారు.
- గుంటూరులో ఓటు హక్కు వినియోగించుకున్న ఎంపీ గల్లా జయదేవ్, మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు.
- విజయవాడలో ఎన్నికల ప్రక్రియను పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడిన ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరుగుతున్నాయని, అన్ని భద్రతా ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. ప్రజలంతా ఈ ఎన్నికల్లో ఓటుహక్కును వినియోగించాలని విజ్ఞప్తి.
- ఏపీ వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. ఓటు హక్కు వినియోగించుకుందుకు ఉదయం నుంచే ప్రజలు పెద్దసంఖ్యలో పోలింగ్ కేంద్రాల వద్దకు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా 9 గంటల వరకు 13.23 శాతం పోలింగ్ నమోదైందని ఎన్నికల అధికారులు వెల్లడించారు.
- విశాఖలో ఓటు హక్కు వినియోగించుకున్న మాజీ ఎంపీ సబ్బం హరి.
- విజయవాడ సీవీఆర్ స్కూల్ ఆవరణలోని పోలింగ్ కేంద్రంలో పోలింగ్ ప్రక్రియను కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ తో కలిసి పరిశీలించిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్.
- విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో తన ఓటు హక్కు వినియోగించుకున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్.
- జీవీఎంసీ పరిధిలోని మారుతీనగర్ పోలింగ్ బూత్‌లో ఓటు హక్కు వినియోగించుకున్న వైఎస్సార్సీపీ నేత, రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి.
- గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) లో 98 వార్డులకు పోలింగ్ ప్రారంభం.
- విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్‌లో 64 డివిజన్లలో పోలింగ్ ప్రారంభం.
- ఏపీలో ప్రారంభమైన మున్సిపల్ ఎన్నికల పోలింగ్.
- సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనున్న పోలింగ్.
- 12 కార్పొరేషన్లు, 71 మున్సిపాలిటీలు/నగర పంచాయతీల్లో పోలింగ్ ప్రారంభం.
- మున్సిపల్ ఎన్నికల నిర్వహణ కోసం 7,915 పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లు.
- 2,214 డివిజన్స్/వార్డుల్లో బరిలో ఉన్న 7,549 మంది అభ్యర్థులు.
- ఈ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోనున్న 77,73,231 మంది ఓటర్లు.
- మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో పాల్గొంటున్న 48,723 మంది అధికారులు, సిబ్బంది.
- వెబ్ కాస్టింగ్ ద్వారా పోలింగ్ పక్రియను పర్యవేక్షిస్తున్న అధికారులు.
- ఎక్కడైనా రీపోలింగ్ అవసరమైతే మార్చి 13 వ తేదీ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహణ.
- మార్చి 14 వ ఉదయం 8 గంటల నుంచి మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు.
- 75 మున్సిపాలిటీలకు నోటిఫికేషన్ విడుదలవగా 4 మున్సిపాలిటీలు ఏకగ్రీవం.
- వైఎస్ఆర్ కడప జిల్లాలో పులివెందుల, చిత్తూరులో పుంగనూరు, గుంటూరులో పిడుగురాళ్ల, మాచర్ల మున్సిపాలిటీలు ఏకగ్రీవం.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ