సైరా సంచలనాలు మొదలు, కర్ణాటక హక్కులు రూ. 32 కోట్లు?

Chiranjeevi Sye Raa Karnataka Rights,Mango News,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Sye Raa Karnataka Theatrical Rights Sold,Sye Raa Movie Updates,Sye Raa Telugu Movies News,#SyeRaa

కొణిదల ప్రొడక్షన్ కంపెనీ నిర్మాణంలో మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా, డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వం లో తెరకెక్కుతోన్న చిత్రం సైరా నరసింహారెడ్డి . ఇటీవలే సినిమా చిత్రీకరణ పూర్తయింది, శరవేగంగా చిరంజీవి డబ్బింగ్‌ కూడా పూర్తి చేశారు, నిర్మాణానంతర కార్యక్రమాలు అంతే వేగంగా జరుగుతున్నాయి. ఇప్పుడు సైరా సినిమా బిజినెస్ తెలుగు ఇండస్ట్రీ లో సంచలనం సృష్టిస్తోంది. ఈ సినిమా కర్ణాటక ప్రదర్శన హక్కులు దాదాపు రూ.32 కోట్లకు కొనుకోలు చేసినట్టు సమాచారం. కర్ణాటకలో చిరంజీవి సినిమాలకి మొదటినుంచి విశేషమైన ఆదరణ మరియు మరింత క్రేజ్‌ ఉంటుంది. కర్ణాటక లోని అనేక ప్రాంతాల్లో చిరంజీవి తెలుగు చిత్రాలు నేరుగా విడుదల అయ్యి సంచలన విజయం సాధించాయి .

సైరా సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు, కర్ణాటక లో చిరంజీవి గత చిత్రం ఖైదీ నెంబర్ 150 ఘన విజయం సాధించింది . ఈ సినిమాలో కన్నడ నటుడు, స్టార్ సుదీప్‌ ఒక ప్రత్యేకమైన పాత్ర పోషించారు. ఇప్పటికే టీజర్‌ సినిమా పై అంచనాలని తార స్థాయిని పెంచింది మరియు చిరంజీవి పుట్టిన రోజు ఆగష్టు 22 న సినిమా తదుపరి ప్రకటన పై అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా కోసం తెలుగు రాష్ట్రాల్లో పంపిణీదారులు విపరీతంగా పోటీపడుతున్నారు. స్వాతంత్ర్య పోరాట నేపథ్యంలో ఉయ్యాలా వాడ నరసింహరెడ్డి జీవిత కథ ఆధారంగా రూపొందిన ఈ చిత్రాన్ని సురేందర్‌రెడ్డి అద్భుతంగా తెరకెక్కించారని సమాచారం.

బాలీవుడ్ షెహనాషా అమితాబ్‌ బచ్చన్‌, తమిళ నటుడు విజయ్‌ సేతుపతి, నయనతార, తమన్నా, అనుష్క, జగపతిబాబు తదితరులు ఈ సినిమా లో కీలక పాత్రలు పోషించారు, ఈ భారీ బడ్జెట్ సినిమాని అక్టోబరులో విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here