అదానీ గ్రూప్ కు మూడు విమానాశ్రయాల బాధ్యత అప్పగించిన మోడీ ప్రభుత్వం

Adani Group To Take Over 3 Airports,Mango News,Adani wins bids to operate 5 AAI airports,Adani Group Latest News,Adani group forays into airport sector,Adani group wins bids to operate 3 airports,Leading Indian Multinational Conglomerate,Union Cabinet approves award of three airports to Adani

అదానీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ త్వరలో 3 విమానాశ్రయాలను స్వాధీనం చేసుకోనుంది. అహ్మదాబాద్, లక్నో మరియు మంగళూరు విమానాశ్రయాలు అభివృద్ధి కి సంబంధించి అదానీ గ్రూప్ కి బాధ్యతలు అప్పగిస్తూ జూలై 3 న, మోడీ ప్రభుత్వం ఒక ప్రకటనను విడుదల చేసింది. ఇప్పటి వరకూ భారత విమానాశ్రయ ప్రాధికార సంస్థ(ఏఏఐ) ఆధ్వర్యంలో ఉన్న ఈ మూడు విమానాశ్రయాల నిర్వహణ, అభివృద్ధి బాధ్యత కోసం అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ లిమిటెడ్‌ సంస్థ అత్యధిక మొత్తానికి బిడ్డింగ్‌ చేసింది, దీంతో పీపీపీ కింద ఆ సంస్థ కు అప్పగించాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది, 50 ఏళ్ల కాలపరిమితి తో ఆ సంస్థకు లీజుకి కేటాయించారు.

అహ్మదాబాద్, లక్నో, మంగళూరు విమానాశ్రయాలతో పాటు, అదానీ గ్రూప్ జైపూర్, త్రివేండ్రం మరియు గౌహతి విమానాశ్రయాలకు కూడా వేలం వేసింది. అయితే, ఇప్పటివరకు 3 విమానాశ్రయాలకు మాత్రమే ఈ ప్రక్రియ పూర్తయింది, మిగతా వాటిపై తర్వాత నిర్ణయం తీసుకోనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here