కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షాతో సీఎం కేసీఆర్ భేటీ

CM KCR Meets Union Home Minister Amit Shah at Delhi Today

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో శనివారం మధ్యాహ్నం న్యూఢిల్లీలో కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షాతో సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణలో ఐపీఎస్ ఆఫీస‌ర్ల సంఖ్య‌ను 195కి పెంచడం, పెండింగ్ లో ఉన్న విభజన హామీలు, ఢిల్లీలో తెలంగాణ భవన్ ఏర్పాటుకు స్థలం సహా రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించినట్టుగా తెలుస్తుంది. మరోవైపు కేంద్ర జల్‌శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌ తో సీఎం కేసీఆర్ భేటీ అయి కృష్ణా, గోదావరి బోర్డు గెజిట్ నోటిఫికేషన్, కృష్ణా జలాల వివాదం వంటి అంశాలపై చర్చించనున్నట్టు తెలుస్తుంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ