హాలీవుడ్ స్టార్‌ హీరోకు కరోనా‌

Hollywood Star hero Hugh Jackman Tested Positive for COVID-19, Actor Hugh Jackman Covid-19 Latest News, Hugh Jackman, Hugh Jackman Covid-19 Update, Hugh Jackman Health Condition, Hugh Jackman tested Corona positive, Hugh Jackman Tested Positive for Covid-19, Hugh Jackman Tests Positive, Hugh Jackman tests positive for Covid-19, Mango News, Mango News Telugu, Hollywood Star Hugh Jackman, Hollywood Star Hugh Jackman Tested Positive for Covid-19

హాలీవుడ్‌ స్టార్‌ హీరో హ్యూ జాక్‌మన్‌ తాజాగా కోవిడ్ బారిన పడ్డాడు. ఈ స్టార్‌ హీరో మన తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా సుపరిచితమే. 2004లో హ్యూ జాక్‌మన్‌ నటించిన “వాన్‌ హెల్సింగ్”‌ చిత్రం తెలుగులో “దెయ్యాల కోట” పేరుతో డబ్‌ అయింది. ఆ సినిమా తెలుగులో సూపర్ హిట్ అయ్యింది. ఆ తర్వాత, హ్యూ జాక్‌మన్‌ “ఎక్స్‌మెన్” సిరీస్‌తో మరింత పాపులర్‌ అయ్యాడు. ప్రస్తుతం ఆయన ‘ది మ్యూజిక్‌ మ్యాన్‌’ షోకి ప్రదర్శన ఇచ్చే పనిలో ఉన్నాడు. అయితే, మంగళవారం జాక్‌మన్‌ కి కరోనా పాజిటివ్‌ వచ్చింది. ఇప్పుడు కరోనా కారణంగా, హ్యూ జాక్‌మన్‌ ప్రదర్శిస్తున్న ‘ది మ్యూజిక్‌ మ్యాన్‌’ షో జనవరి 1 వరకు వాయిదా పడింది.

తనకు కరోనా సోకిన విషయాన్ని సోషల్‌ మీడియా వేదికగా జాక్‌మన్‌ స్వయంగా ప్రకటించాడు. “ఈ రోజు ఉదయం (డిసెంబర్‌ 29, మంగళవారం) నేను కొవిడ్‌ పరీక్ష చేసుకున్నాను. రిజల్ట్ పాజిటివ్‌ వచ్చిందనే విషయాన్ని మీకు చెప్పాలనుకుంటున్నాను. నేను బాగానే ఉన్నాను. ప్రస్తుతం నాకు.. జలుబు, గొంతు నొప్పి, ముక్కు కారడం వంటి లక్షణాలు ఉన్నాయి. వీలైనంత త్వరగా కోలుకునేందుకు ప్రయత్నిస్తాను. త్వరలోనే రివర్ సిటీ వేదికపై డెఫినెట్ గా మీ అందరినీ కలుసుకుంటాను” అని హ్యూ జాక్‌మన్‌ తెలిపాడు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ