ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల తయారీ కంపెనీ టెస్లా (Tesla) అధినేత, ట్విట్టర్ (Twitter) బాస్ ఎలాన్ మస్క్.. మరో సంచలనానికి శ్రీకారం చుట్టారు. టాప్ మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ ట్విట్టర్ (Twitterలో ఉన్నన్ని రోజులూ.. రోజుకో సంచలనం రేపుతూ నిత్యం వార్తల్లో నిలిచిన ఈ అపర కుబేరుడు.. తాజాగా ఓ కొత్త స్టార్టప్‌ను స్టార్ట్ చేశారు. కార్పొరేట్ సెగ్మెంట్‌లో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టేసారు. అవును సంచలన నిర్ణయాలకు మారుపేరుగా పిలుచుకొనే ఎలాన్ మస్క్ (Elon Musk) ఎక్స్‌ఏఐ (xAI) అనే మరో కొత్త కంపెనీతో ముందుకొచ్చారు.
ఇప్పటికే ‘ఓపెన్‌ఏఐ’ (OpenAI) సృష్టించిన చాట్‌బాట్ ‘చాట్‌జీపీటీ’ (ChatGPT) విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చింది. దీంతో ఫ్యూచర్లో మనుషుల జీవితాలను మరింత ఎక్కువగా ప్రభావితం చేయొచ్చనే అంచనాలు ఉన్న ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో.. పూర్తిస్థాయిలో అడుగుపెట్టారు ఎలాన్ మస్క్. చాట్‌జీపీటికి పోటీగా ఎక్స్‌ఏఐ (xAI) పేరుతో మరో కృత్రిమ మేధ (Artificial Intelligence) కంపెనీని నెలకొల్పారు. దీంతో మస్క్ పోర్ట్ ఫోలియోలో మరో కంపెనీ జత అయింది. టాప్ సెర్చింజిన్ గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ (Alphabet), మైక్రోసాఫ్ట్ (Microsoft), ఓపెన్ఏఐ (OpenAI), గూగుల్ డీప్‌మైండ్ (Google DeepMind).. వంటి సంస్థల్లో పని చేసిన కొందరు మాజీ ఉద్యోగులతో కలిసి బుధవారం సాయంత్రం ఈ స్టార్టప్‌ను ప్రారంభిస్తూ లోగోను ఆవిష్కరించారు.
ఈ కంపెనీకి ఎలాన్ మస్క్ చీఫ్‌గా వ్యవహరిస్తారు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌ను కంట్రోల్ చేయాలనే ఉద్దేశంతో మస్క్ ఈ ఏఐ స్టార్టప్‌ను ప్రారంభించినట్లు చెబుతున్నారు. తమ కృత్రిమ మేధ కంపెనీ లక్ష్యం విశ్వాన్ని నిజంగా అర్థం చేసుకోవడమేనని అన్నారు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగాన్ని రెగ్యులరైజ్ చేయాల్సిన అవసరం ఉందంటూ మస్క్ చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చారు. ఇప్పుడు దీనికి బదులుగా వాస్తవికతను అర్థం చేసుకోవాల్సి ఉందని, అందుకే ఈ కంపెనీని నెలకొల్పినట్లు చెబుతున్నారు. ఏఐ బేస్డ్ కంపెనీని నెలకొల్పాలనే ఉద్దేశంతో చాలా రోజుల నుంచీ ఉందని, అది ఇప్పటికి కార్యరూపం దాల్చిందని మస్క్ అన్నారు. ఈ ఏడాది మార్చిలో దీనిపై వర్కవుట్ చేశామని వివరించారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెను విప్లవంగా మారిన ‘చాట్‌జీపీటీ’ డెవలప్మెంట్ దశలో ఉన్న టైములో ఓపెన్‌ఏఐ సంస్థలో భారీ పెట్టబడులు పెట్టిన ఎలాన్ మస్క్.. తర్వాత వాటిని ఉపసంహరించుకున్నారు. ఆ తర్వాత మైక్రోసాఫ్ట్ సంస్థ ఓపెన్‌ఏఐలో పెట్టుబడులు పెట్టింది. అలా ఓపెన్‌ఏఐ చాట్‌జీపీటీని అందుబాటులోకి తీసుకొచ్చింది. అంతకుముందు ఏఐకి సంబంధించి మానవాళికి డేంజర్ పొంచి ఉందని చాలామార్లు మస్క్ హెచ్చరించారు. చాట్‌జీపీటీ వంటి చాట్‌బాట్‌లు పక్షపాతంగా వ్యహరించే ప్రమాదముందని కూడా అన్నారు. కానీ అనూహ్యంగా అదే ప్లాట్‌ఫామ్‌కు వచ్చిన మస్క్.. ఇలాంటి వాటిని సమర్థంగా ఎదుర్కొనేందుకు తాను కూడా కృత్రిమ మేధ ఆధారిత చాట్‌బాట్‌ను తీసుకురానున్నట్లు చెబుతున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE