
భారతీయ ఎన్నికల ప్రక్రియను చూడటానికి విదేశీ పర్యాటకులు క్యూకట్టడం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశంలో జరుగుతున్న18 వ లోక్ సభ ఎన్నికలపై అందరి దృష్టి పడింది. ఐక్య రాజ్య సమితి మొదలు అగ్రరాజ్యాల వరకు ఎన్నో దేశాల వారు భారత్‌లో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలను పరిశీలించడానికి వస్తున్నారు. ఎన్నికల సరళిని చూడడానికి వచ్చే వాళ్లలో ఎక్కువ మంది విద్యార్థులు, జర్నలిస్టులు, వారసత్వ సంపదను పరిరక్షించాలనుకునే వారు, సాంస్కృతిక సంబంధాలపై ఆసక్తి ఉన్నవారు వస్తున్నారు. దీంతో ఇప్పుడు పర్యాటకులతో కిటకిటలాడుతోంది.
దేశంలోనే అతిపెద్ద ఓట్ల పండుగగా భావించే ఈ ఎన్నికల్లో సుమారు 96 కోట్ల మందికి పైగా తమ ఓటుహక్కును వినియోగించుకుంటున్నారు. ఇంత మామూలుగానే ఆధ్యాత్మిక టూరిస్ట్ కేంద్రంగా ప్రపంచ దేశాల్లో పేరున్న భారత్..ఇప్పుడు ప్రజాస్వామ్య ఎన్నిక ప్రక్రియతో కూడా పర్యాటకుల్ని ఆకట్టుకుంటోంది. ఈ ఎన్నికలు ఎలా జరుగుతున్నాయో చూద్దామని కొంతమంది చూడటానికి వస్తే.. ఇక్కడ జరిగే ఓటింగ్ సరళిని చూడటానికి మరికొంతమంది వస్తున్నారట. పార్లమెంటుతో పాటు జరిగే వివిధ రాష్ట్రాలలో జరిగే అసెంబ్లీ ఎన్నికలను పరిశీలించడానికి కొంతమంది ఆసక్తి చూపుతున్నారట.
2019 ఎన్నికల నాటికంటే 2024లో వచ్చిన ఎన్నికల టూరిస్టుల సంఖ్య పెరగడం ఇప్పుడు చర్చనీయాంశం అయింది. 2019ఎన్నికలకు 25వేల మందికి పైగా విదేశీయులు వచ్చినట్టు రికార్డులు చెబుతుంటే.. ఈసారి మొదటి మూడు విడతల ఎన్నికలు పూర్తయ్యే సమయానికే 50 వేల మంది దాకా విదేశీ టూరిస్టులు రాగా. పోలింగ్ మే 13న జరిగే ఎన్నికలతో సహా మొత్తం ఏడు విడతలలో జరిగే ఎన్నికల కోసం మూడు, నాలుగు రెట్లు ఎక్కువగా టూరిస్టులు రానున్నట్టు తెలుస్తోంది.
ఈసారి ఎన్నికల తంతును చూడటానికి ఎక్కువగా ఉత్తరప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కర్నాటక, హైదరాబాద్ ప్రాంతాలకు ఎక్కువగా వచ్చినట్టు తెలుస్తోంది. ఆస్ట్రేలియా, రష్యా, శ్రీలంక, బంగ్లాదేశ్ తో పాటు 23 దేశాలకు చెందిన ప్రతినిధులు ఈ ఎన్నికల పరిశీలనకు వచ్చినట్టు కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ తెలిపింది.పార్లమెంటు ఎన్నికలలో వివిధ నియోజకవర్గాలలో, గ్రామాల్లో, వార్డుల్లో ఏర్పాటు చేసే ప్రచార సభలను, బహిరంగ సభలను, ఆ సభల సందర్భంగా జరిగే నృత్య ప్రదర్శనలు, పాటలను విదేశీయులు గమనిస్తున్నారు. ప్రచారానికి వెళ్లేనేతలకు జరిగే స్వాగత సత్కారాలను,ఈ సభలలో నృత్యాలను, సంగీత బృందాలను, వాద్యపరికరాలు వినియోగిస్తున్న తీరును కూడా ఆసక్తి చూపుతున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY