
ఓట్స్ ఆరోగ్యానికి మంచివని..బరువు తగ్గాలనుకున్నవాళ్లకు అవి చాలా మంచివని చాలామంది తమ డైట్లో చేర్చుకుంటారు. అయితే మనిషి శరీరానికి కావాల్సిన పోషకాలు చాలావరకూ ఓట్స్‌లో ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఓట్స్‌లో పీచు పదార్థం, విటమిన్ బి-2, విటమిన్ సి ఎక్కువగా ఉంటాయి. కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్స్ కూడా ఎక్కువగానే ఉంటాయి. చిన్నపిల్లల ఆహారంలో ఓట్స్‌ను ఏదో ఒక రూపంలో ఇవ్వడం వల్ల వారికి మంచి పోషక విలువలు లభిస్తాయి.
ప్రొటీన్లు, పీచు ఎక్కువగా కలిగిన ఓట్స్ తినటం వల్ల.. నీరసం రాదు. త్వరగా తయారు చేసుకునే వంటకాలలో ఓట్స్ మీల్ ఒకటి. అంతేకాదు ఓట్స్‌లో పీచు, ప్రొటీను ఉండటంతో.. కడుపు నిండిన బావన కలిగించడంతో పాటు ఎక్కవ సమయం పాటు ఆకలి లేకుండా చేస్తాయి. ఉదయం పూట ఓట్స్ తీసుకోవటం వల్ల.. భోజన సమయం వరకు కడుపు నిండినట్లే ఉంటుంది. దీంతో మధ్యలో ఎలాంటి ఆహారాలను తినాలనే కోరిక కలుగదు.
ఓట్స్ రక్తంలో చక్కెర స్ధాయిలను పెరగకుండా చేస్తాయి. ఇందులో ఉండే పీచు పదార్ధం వల్ల కార్పోహైడ్రేట్లు రక్తంలోకి చక్కెరను నెమ్మదిగా విడుదల చేస్తాయి. ఓట్స్ ను రాత్రి నానబెట్టి ఉదయాన్నే అల్పాహారంగా తినొచ్చు. దీనిని వండకుండానే ఉదయం పూట బ్రేక్ ఫాస్ట్ గా తీసుకోవచ్చు. ఓట్స్ లో ఉండే ఫైబర్ బెలా గ్లూకాన్ మనలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడంలోనూ.. గుండె జబ్బులు రాకుండా కాపాడటంలోనూ ముందుంటుంది.
అలాగే ఓట్స్.. క్యాన్సర్ నుంచి రక్షణ కల్పించటంతో పాటు జీర్ణ వ్యవస్ధ తీరును మెరుగు పరచటంలోనూ కీలక పాత్ర పోషిస్తాయి. శరీరంలో గ్లూకోజ్, ఇన్సులిన్ లను సక్రమంగా వినియోగించుకోవటంలో ఓట్స్ దోహదం చేస్తాయి. దీని వల్ల మధుమేహం రాకుండా చూసుకోవచ్చు. ఒక రోజుకు మన శరీరానికి కావాల్సిన మెగ్నీషియం కేవలం 40 గ్రాముల ఓట్స్ లోనే లభిస్తుంది. ఈ మెగ్నీషియం వల్ల బీపీ అదుపులో ఉండటంతో పాటు రక్తనాళాలు కుచించుకు పోవడం తగ్గుతుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY