‘‘జగన్.. గుర్తుపెట్టుకో.. నిన్ను అథఃపాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కల్యాణే కాదు.. మా పార్టీ జనసేనే కాదు..’’ జనసేనాని పవన్ కల్యాణ్ ఇచ్చిన ఈ స్టేట్‌మెంట్ చాలా మందికి గుర్తు ఉండే ఉంటుంది. ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ ఘోర ఓటమి చెందడంతో ఆ వీడియో ఇప్పుడు ట్రెండింగ్‌లో కూడా ఉంది. పవన్ చెప్పినట్లు నిజంగానే వైసీపీ అథఃపాతానికి వెళ్లిపోయింది. పట్టుమని పది సీట్లు కూడా పొందలేకపోయింది. ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయింది. మంత్రుల్లో జగన్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇద్దరు తప్ప అందరూ ఓడిపోయారు. వైసీపీ ఇంతటి ఘోర పరాభవంలో పవన్ పాత్ర గొప్పదని చెప్పడంలో సందేహం లేదు.
ఏపీలో జగన్‌ను గద్దె దించడమే లక్ష్యంగా పవన్ రాజకీయాలు చేశారు. ఎన్నో త్యాగాలు చేశారు. ఎన్నో అవమానాలు భరించారు. అయినప్పటికీ.. హల్లో ఏపీ.. బైబై వైసీపీ.. అనే నినాదాన్ని జోరుగా జనాల్లోకి తీసుకెళ్లారు. 2014లో జనసేన పార్టీని స్థాపించిన పవన్ కళ్యాణ్, ఆ ఏడాది ఎన్నికల్లో పోటీ చేయలేదు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన పవన్ కళ్యాణ్‌కి ఘోర పరాభవం ఎదురైంది. ఒకే ఒక్క స్థానాన్ని సొంతం చేసుకోగలిగింది. అన్నింటికీ మించి రెండు స్థానాల నుంచి పోటీ చేసిన జనసేన నేత పవన్ కళ్యాణ్‌కి రెండు స్థానాల్లోనూ ఓటమి ఎదురైంది. సినిమాల్లో తిరుగులేని క్రేజ్, స్టార్‌డమ్ ఉన్న పవన్ కళ్యాణ్, రాజకీయాల్లో ఇలాంటి ఓటమి ఎదురైన తర్వాత.. మనకెందుకీ రాజకీయాలు అని పార్టీని తీసేయొచ్చు.
అన్న చిరంజీవి దారిలో తన పార్టీలో వేరే పార్టీలో విలీనం చేసి, ఏదో ఒక పదవిని అనుభవించవచ్చు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం అలా చేయలేదు. పార్టీ పెట్టిన తర్వాత ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నాడు. మరెన్నో కష్టాలను అనుభవించాడు. ఏసీ గదుల్లో అన్ని వసతులు ఉన్న వ్యానిటీ వ్యానులో రాజభోగాలు అనుభవించే పవన్ కళ్యాణ్, ప్రజల కష్టాలను తెలుసుకోవడం కోసం మండుటెండలో నడిచాడు. చెమటతో స్నానం చేశాడు. ఆ కష్టాలను ఫలితం ఎట్టకేలకు దక్కింది.
ఏపీలో ఎన్డీఏ కూటమి ప్రభంజనం సృష్టించడంలో పవన్ పాత్ర అమోఘం. తన బలాబలాలను పట్టించుకోకుండా కూటమిని కలిసికట్టుగా ఉంచడమే ధ్యేయం ముందుకు సాగారు. అధికార పార్టీ వైసీపీని గద్దె దించడానికి అవసరమైన సందర్భాల్లో తాను తగ్గాడు. ఎన్ని స్థానాల్లో పోటీ చేశామో కాదు.. ఎన్ని స్థానాల్లో గెలిచామో ముఖ్యమని చాటిచెబుతూ వంద శాతం ఫలితాలను సొంతం చేసుకున్నాడు. 21కు 21 (ఈ ఆర్టికల్ రాసేసమయానికి 17 గెలుపు, ఏడు లీడ్) అసెంబ్లీ స్థానాలు, రెండుకు రెండు (లీడ్‌లో ఉన్నాయి) ఎంపీ స్థానాల్లో విజయకేతనం ఎగురవేసి వంద శాతం ఫలితాలతో రికార్డు సృష్టించారు. అత్యధిక మెజార్టీతో తాను గెలవడమే కాకుండా, తన అభ్యర్థులు అందరినీ గెలిపించుకున్నారు. దటీజ్ పవన్ కల్యాణ్.. అని పేరు పొందారు. సినిమాల్లోనే కాదు.. రాజకీయాల్లోనూ పవర్‌ఫుల్ స్టార్‌గా మారారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY