బీఆర్ ఎస్ వ‌ల్లే బీజేపీ గెలుపు.. రేవంత్ సంచ‌ల‌న కామెంట్స్

CM Revanth Reddy Sensational Comments On BRS,Revanth Reddy Sensational Comments On BRS,Sensational Comments On BRS,Cm Revanth Reddy,BRS,BJP, Congress,Telangana Election Results 2024,TS Politics,Mango News,Mango News Telugu,Lok Sabha Elections 2024,Hyderabad Election Results 2024,Hyderabad Lok Sabha Result,Mango News,Mango News Telugu
cm revanth reddy, brs, bjp, congress

లోక్‌స‌భ ఎన్నిక‌ల ఫ‌లితాల‌పై తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి సంచ‌ల‌న కామెంట్లు చేశారు.  బీజేపీని గెలిపించ‌డానికి బీఆర్ ఎస్ నాయ‌కులు ఆత్మ బ‌లిదానం, అవ‌య‌వ‌దానానికి పాల్ప‌డ్డార‌ని ఆరోపించారు. బీఆర్ ఎస్ ఓట్ల‌ను బీజేపీకి మ‌ళ్లించార‌న్నారు. బీజేపీ గెలిచిన 8 నియోజ‌క‌వ‌ర్గాల్లో బీఆర్ ఎస్ 7 చోట్ల డిపాజిట్ కోల్పోయింద‌ని తెలిపారు. లోక్‌స‌భ ఎన్నిక‌ల ఫ‌లితాల‌పై బుధ‌వారం ఉద‌యం రేవంత్ మీడియాతో మాట్లాడారు. బ‌ల‌హీన‌మైన అభ్య‌ర్థుల‌ను కేసీఆర్ ఎన్నిక‌ల్లో నిల‌బెట్టి బీజేపీ గెలుపున‌కు దోహ‌ద‌ప‌డ్డార‌ని, పార్టీశ్రేణులు బీజేపీకి ప‌నిచేసేలా చేశార‌ని ఆరోపించారు. అందుకే బీజేపీకి ఓట్లు, సీట్లు పెరిగాయ‌న్నారు. బీఆర్ ఎస్ ఓట్లు 30.5 శాతం నుంచి 16.5 శాతానికి ప‌డిపోయాయ‌ని, బీఆర్ ఎస్‌ కు ఎంత‌యితే త‌గ్గాయో, అంతే శాతం బీజేపీకి పెరిగాయ‌ని వెల్ల‌డించారు. ఎన్నిక‌ల ఫ‌లితాల‌ను బీజేపీకి మార్చి కేసీఆర్ కుటుంబం ద్వంద్వ‌నీతికి పాల్ప‌డింద‌ని, స‌మాజం, సెక్యూల‌ర్ వాదులు ఈ అంశాన్ని గుర్తించాల‌ని తెలిపారు.

అత్యంత కీల‌క‌మైన అంశం ఏంటంటే.. 2001లో కేసీఆర్ టీడీపీకి రాజీనామా చేసి.. సిద్దిపేట‌లో ఎమ్మెల్యేగా పోటీ చేసిన‌ప్ప‌టి నుంచీ, 2023 డిసెంబ‌ర్ వ‌ర‌కు బీఆర్ ఎస్‌కు అత్య‌ధిక మెజార్టీ వ‌చ్చిన నియోజ‌క‌వ‌ర్గం సిద్దిపేట అని, ఈ పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో హ‌రీశ్‌రావు త‌న పూర్తి ఓట్ల‌ను బీజేపీకి బ‌దిలీ చేశార‌ని తెలిపారు. అందుకే ఈ ఎన్నిక‌ల్లో సిద్దిపేట‌లో బీఆర్ ఎస్ కు వ‌చ్చిన మెజార్టీ 2500 మాత్ర‌మే అన్నారు. సిద్దిపేట‌లో పూర్తి ఆధిప‌త్యాన్ని ప్ర‌ద‌ర్శంచే హ‌రీశ్‌రావు, కేసీఆర్.. మెద‌క్ బీజేపీలో గెలిపించి.. బ‌డుగు, బ‌ల‌హీనవ‌ర్గానికి చెందిన కాంగ్రెస్ అభ్య‌ర్థిని ఓడించార‌ని వివ‌రించారు. సిద్దిపేట‌లో వ‌చ్చిన మెజార్టీ వ‌ల్లే కాంగ్రెస్ సీటు కోల్పోయింద‌న్నారు. బీఆర్ ఎస్ అభ్య‌ర్థి వెంక‌ట్రామిరెడ్డి ని న‌మ్మించి మోసం చేయ‌డ‌మే కాకుండా.. కాంగ్రెస్ ను ఓడించేందుకు ఆత్మ‌బ‌లిదానం చేసుకున్నారని విమ‌ర్శించారు.

పార్టీ పెట్టిన త‌ర్వాత‌.. పార్లమెంట్ లో బీఆర్ ఎస్ ప్రాతినిధ్యం లేక‌పోవ‌డం ఇదే మొద‌టిసార‌ని రేవంత్ తెలిపారు. ప్ర‌భుత్వాన్ని అస్తిర‌ప‌ర‌చాల‌నే ఆలోచ‌న‌ల‌తో కుట్రల‌కు పాల్ప‌డితే ప్ర‌జ‌లు పూర్తిగా బీఆర్ ఎస్ ను మ‌ట్టిక‌రిపించారని అన్నారు. చివ‌ర‌కు తెలంగాణ ఉత్స‌వాల్లో కూడా పాల్గొన‌కుండా చిల్ల‌ర‌మ‌ల్ల‌ర కార‌ణాలు చూప‌డం ప్ర‌జ‌లు గ‌మ‌నించారన్నారు. ఇప్ప‌టికైనా వ్య‌వ‌హార శైలి మార్చుకుని ప్ర‌తిప‌క్షంగా స‌ల‌హాలు సూచ‌న‌లు ఇవ్వాల‌ని, ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి స‌హ‌క‌రించాల‌ని కోరారు. మీ కుటుంబం కోసమో, ఆస్తుల కోస‌మో మీరు ప‌నిచేస్తే.. ప్ర‌జ‌లు గ‌మ‌నించి బుద్ధిచెబుతార‌ని వెల్ల‌డించారు.

ఎన్నిక‌ల్లో కాంగ్రెస్‌కు సంతోష‌క‌ర‌మైన ఫ‌లితాలు వ‌చ్చాయ‌ని రేవంత్ వివ‌రించారు. ఈ ఎన్నిక‌లు త‌మ 100 రోజుల పాల‌న‌కు రెఫ‌రెండం అని, వంద రోజుల పాల‌న త‌ర్వాత 41 శాతం ఓట్లు వ‌చ్చాయ‌న్నారు. అసెంబ్లీ కంటే ఓట్లు పెరిగాయ‌ని తెలిపారు. గెలిచిన సీట్ల‌లో అత్య‌ధిక మెజార్టీ అందించార‌ని తెలిపారు. కంటోన్మెంట్ ఉప ఎన్నిక‌లోనూ గెలిచామ‌న్నారు. మ‌రోవైపు కేంద్రంలోనూ కాంగ్రెస్ బ‌ల‌ప‌డింద‌న్నారు. ఎన్డీఏకు ఇండియానే ప్ర‌త్యామ్నాయ‌మ‌న్నారు. మోదీ ప్ర‌జావ్య‌తిరేక విధానాల‌ను రాహుల్ ప్ర‌జ‌ల‌కు వివరించారని, జోడోయాత్ర‌తో దేశంలో ప‌రిస్థితి మారిందని తెలిపారు. కాంగ్రెస్‌కు అండ‌గా నిలిచిన వారంద‌రికీ కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY