ట్యాక్స్ పేయర్స్.. రిటర్నులు దాఖలు చేసే సమయం దగ్గరకు వచ్చేసింది. అయితే దీనిపై సరైన అవగాహన లేకపోయినా.. లేదా నిపుణుల సహాయం లేకపోయినా ఐటీఆర్ ఫైల్ చేయడం కొంచెం కష్టమైన విషయమే. కొంత మంది మాత్రం జాగ్రత్తగానే ఈ ప్రక్రియను పూర్తి చేస్తారు. కానీ, మరికొంతమంది గడువు సమీపిస్తుండటంతో ..కొన్ని పొరపాట్లు చేస్తుంటారు.అయితే ఐటీఆర్ ఫైలింగ్‌లో చేసే తప్పులను సరిదిద్దుకునే అవకాశం ఉంటుందన్న విషయం చాలామందికి తెలియదు. రివైజ్డ్ రిటర్నుల దాఖలు చేయడం ద్వారా ఆ తప్పులను సవరించుకోవచ్చు. కానీ, దానికోసం ప్రత్యేకంగా కొంత సమయాన్ని కేటాయించాలి. అందుకే ఫస్ట్ టైమ్ ఫిల్ చేసినప్పుడే జాగ్రత్తగా ఫిల్ చేస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఐటీ రిటర్నులు దాఖలు చేసేటప్పుడు తప్పులు లేకుండా చూసుకోవడం చాలా ముఖ్యం.
సెంట్రల్ డైరక్ట్ ట్యాక్స్ డిపార్ట్ మెంట్ ఇప్పటికే ఏడు రకాల ఐటీ ఫారాలను నోటిఫై చేసింది. వీటిలో ఏది సరైందో చూసి ఎంచుకోవాలి. రూ.50లక్షల వరకూ జీతం, ఒక ఇంటిపై ఆదాయం, వడ్డీ వంటి ఇతర మార్గాల్లో ఆదాయం వస్తున్నప్పుడు ఐటీఆర్-1 దాఖలు చేయాలి. వ్యక్తులు, హిందూ అవిభాజ్య కుటుంబాలు, సంస్థలకు రూ.50 లక్షలకు పైగా ఆదాయం ఉన్నప్పుడు ఐటీఆర్-4ను ఎంచుకోవచ్చు. రూ.50లక్షలకు పైగా ఆదాయం ఉండి, ఒకే ఇంటి ద్వారా ఇన్కమ్ ఉన్నప్పుడు ఐటీఆర్-2ను దాఖలు చేయాలి. ఐటీఆర్-1, ఐటీఆర్-2ల విషయంలో అనుమానం ఉన్నవారు ఐటీఆర్-3ని ఎంచుకున్నా పర్వాలేదు. షేర్లలో క్రయవిక్రయాలు చేసేవారు..వారు నిర్వహించిన లావాదేవీల ఆధారంగా ఐటీఆర్-2 లేదా ఐటీఆర్ 3ని ఎంచుకోవాల్సి ఉంటుంది. మిగిలిన పత్రాలు కంపెనీలు, వ్యాపార సంస్థలకు వర్తిస్తాయి.
ట్యాక్స్ పేయర్స్ ఈ-ఫైలింగ్ పోర్టల్‌లో ముందుగానే తమతమ బ్యాంకు ఖాతాలను ధ్రువీకరించాలి. ట్యాక్స్ పేయర్ల ఖాతా యాక్టివ్గానే ఉందని ఇది నిర్ధారించాకే రిఫండ్లు డిపాజిట్ చేయడానికి వెసులుబాటు ఉంటుంది. ఐటీఆర్ దాఖలు చేసిన తర్వాత దాన్ని ట్యాక్స్ పేయర్స్ కచ్చితంగా ధ్రువీకరిస్తేనే దాఖలు ప్రక్రియ పూర్తయినట్లు అవుతుంది. లేదంటే ఆ రిటర్నులను పరిగణనలోకి తీసుకోరు. ఐటీఆర్ అప్లోడ్ చేసిన 30 రోజుల్లోగా ఐటీఆర్ ఫైలింగ్ ను వెరిఫై చేయాల్సి ఉంటుంది.
ఆదాయపు పన్ను మినహాయింపుల్లో సెక్షన్ 80సీ అనేది చాలా ముఖ్యమైనది. ఐటీ నిబంధనల ప్రకారం ఈ సెక్షన్ కింద వివిధ పెట్టుబడి పథకాల్లో మదుపు చేసి, రూ.1 లక్షా50వేల వరకూ మినహాయింపు పొందొచ్చు. ఈపీఎఫ్, పీపీఎఫ్, ఈఎల్ఎస్ఎస్, హోమ్ లోన్ అసలు, పిల్లల ట్యూషన్ ఫీజులు, జీవిత బీమా పాలసీలకు చెల్లించే ప్రీమియం వంటివి అన్నీ ఈ సెక్షన్ పరిధిలోకే వస్తాయి. సెక్షన్ 80డీలో ఆరోగ్య బీమా ప్రీమియం వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. సేవింగ్స్ అకౌంట్ ద్వారా వచ్చిన వడ్డీ ఆదాయంపై రూ.10వేల వరకు 80టీటీఏ కింద మినహాయింపు కోరవచ్చు. అలాగే వేతనంలో హెచ్ఆర్ఏ లేనట్లయితే రెంట్ చెల్లింపులకు 80జీజీ కింద మినహాయింపు ఉంటుంది. ట్యాక్స్ పే చేయడం కోసం అన్ని రకాల పెట్టుబడులు, ఖర్చులను రిటర్నులలో క్లియర్ గా మెన్షన్ చేయాలి.
చాలామంది ట్యాక్స్ పేయర్స్ అదనపు మార్గాల ద్వారా వచ్చే ఆదాయాన్ని ఐటీఆర్‌లో చూపించాల్సిన పని లేదనుకుంటారు. వడ్డీ, కమిషన్ వంటి వాటినుంచి వచ్చే ఇన్‌కమ్‌ను అందులో చూపించకుండా వదిలేస్తుంటారు. వీటన్నింటిపై టీడీఎస్ కట్ చేసేరు కదా అని ఇది అవసరం లేదనుకుంటారు. కానీ, ఐటీఆర్‌లో ప్రతీ ఆదాయ మార్గాన్ని చెప్పాలి. లేదంటే తర్వాత ఇబ్బందులు ఎదురవుతాయి. అలాగే ఐటీఆర్ ఫైలింగ్‌ను గడువులోగా పూర్తి చేయకపోతే.. రూ.1,000 నుంచి రూ.5,000 వరకు జరిమానా చెల్లించాల్సి వస్తుంది. ఆడిట్ అవసరం లేని వ్యక్తులు.. జులై 31 వరకూ రిటర్నులు దాఖలు చేసుకోవచ్చు.
కొన్నిసార్లు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్ మెంట్ దగ్గర ఉన్న వివరాలకూ, మీ ఫారం-16కూ మ్యాచ్ కాకపోవచ్చు. మీ వద్ద వసూలు చేసిన ట్యాక్స్ ను ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్ మెంట్ కు జమ చేయకపోవడం వల్ల ఈ తేడా కనిపిస్తుంది. ఐటీ రిటర్నులు దాఖలు చేయడానికి ముందు ఫారం-16, ఫారం 16ఏ, 26ఏఎస్, ఏఐఎస్ అంటే వార్షిక సమాచార నివేదికలను పూర్తిగా పరిశీలించాలి. ఏదైనా తేడా ఉంటే మీ కంపెనీ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లి, సరిచేసుకోవాలలి. పొరపాట్లతో ఎలా పడితే అలా ఐటీఆర్ ఫైల్ చేస్తే నోటీసులు వచ్చే ప్రమాదం ఉంది.
ఐటీఆర్ దాఖలు చేసేటప్పుడు అన్ని ఆదాయాలను కూడా తప్పనిసరిగా యాడ్ చేయాలి. కొన్ని ఆదాయాలను దాచిపెట్టడం చట్టాన్ని ఉల్లంఘించినట్లే అవుతుంది. ఒకవేళ ఈ విషయాన్ని ఆదాయపు పన్ను శాఖ గుర్తిస్తే నోటీసులు పంపే అవకాశముంటుంది. మినహాయింపు పరిధిలోకి వచ్చే ప్రతి ఇన్కమ్ గురించీ రిటర్నులలో చూపించాల్సిందేనని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE