రాష్ట్రాభివృద్ధిలో ప్రభుత్వంతో పాటు ప్రజలు మమేకం కావాలి: చంద్రబాబు

People Should Be Involved In The Development Of The State Along With The Government Says Chandrababu,People Should Be Involved In The Development Of The State, Chandrababu At Tirumala, CM Chandrababunaidu, AP CM,TDP,Development Of The State Along With The Government,Development Of The State,AP Government,AP Polling, AP Election Results , Assembly Elections, Lok Sabha Elections, AP Live Updates, AP Politics, Political News, Mango News, Mango News Telugu
cm chandrababunaidu, ap cm, chandrababu at tirumala, tdp

ఏపీలో ప్రజా పాలన ప్రారంభమయిందని.. తిరుమల నుంచే ప్రక్షాళన ప్రారంభం కావాలని టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. గురువారం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. నాలుగోసారి ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత తొలిసారి తిరుమలకు వెళ్లారు. బుధవారం రాత్రి కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు వెళ్లిన చంద్రబాబు.. గురువారం ఉదయం శ్రీవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు.

అలిపిరి వద్ద క్లెమోర్ మైన్స్ దాడి జరిగినప్పుడు ప్రాణాలతో బయటపడ్డానని.. తిరుమల శ్రీవారే తనను రక్షించారని చంద్రబాబు వెల్లడించారు. రాష్ట్రానికి, తెలుగు జాతికి తాను చేయాల్సింది ఇంకా ఉందని గుర్తించి.. శ్రీవారు తనకు ప్రాణభిక్ష పెట్టారని వెల్లడించారు. ఉదయం నిద్రలేస్తూనే నిండు మనసుతో ఒక్క నిమిషం శ్రీ వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తుంటానని అన్నారు.  గతంలో ఎన్నో ఎన్నికలు చూశానని.. ఈసారి మాత్రం ప్రజలు చరిత్రాత్మక తీర్పును ఇచ్చారన్నారు. శ్రీ వెంకటేశ్వరస్వామివారి ఆశీస్సులతో ఎన్నికల్లో ఘన విజయం సాధషించామన్నారు.

ఆంధ్రప్రదేశ్‌ను పేదరికం లేని రాష్ట్రంగా మార్చుతానని అన్నారు. 1995లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తాను తొలిసారి ముఖ్యమంత్రి అయ్యేంతవరకు పాలన సచివాలయానికే పరిమితమై ఉండేదని.. ఆ తర్వాత ప్రక్షాళన చేసి సరికొత్త పాలన ప్రారంభించామని వెల్లడించారు. ఆర్థిక సంస్కరణలు అమలు చేశామన్నారు. గత అయిదేళ్లు ప్రజలు భయపడిపోయారని చెప్పారు. ఇకపై పరదాలు, చెట్లు కొట్టడం లాంటివి ఉండవని తేల్చేశారు. నేరస్థులను ఎట్టిపరిస్థితిలోనూ విడిచిపెట్టేది లేదన్నారు. రాష్ట్ర ప్రజలందరికీ మంచి చేయడమే తమ లక్ష్యమని చంద్రబాబు నాయుడు వెల్లడించారు. రాష్ట్ర అభివృద్ధిలో ప్రభుత్వంతో పాటు ప్రజలు కూడా మమేకం కావాలని తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE