తిరుమల తిరుపతి దేవస్థానం గురించి ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చిన ఏపీ సీఎం చంద్రబాబు టీటీడీని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసేపనిలో పడ్డారు.అప్పుడు ఆయన చెప్పినట్లుగానే దీనిపై వడివడిగా అడుగులు వేస్తున్నారు.తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా సీనియర్ ఐఏఎస్ అధికారి జె. శ్యామలారావును నియమించారు.
టీటీడీ కొత్త ఈవోగా జె. శ్యామలారావును నియమించినట్లుగా శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. వైఎస్ జగన్ ప్రభుత్వంలో.. టీటీడీ ఈవోగా ధర్మారెడ్డి పని చేసి ఏకపక్షంగా వ్యవహరిస్తారన్న పేరును తెచ్చుకున్నారు. మొదటి నుంచీ కూడా ఆయన కేవలం వైసీపీ నాయకులను అనుకూలంగా వ్యవహరించేవారు.
అంతేకాదు తిరుమల తిరుపతి పవిత్రను దెబ్బ తీసేలా కొన్ని సంఘటనలు కూడా అప్పట్లో జరిగాయి. దీంతో టీటీడీ ఈవో ధర్మారెడ్డి తీరుపై టీడీపీ నాయకులు తీవ్ర ఆరోపణలు చేసినా వైసీపీ గవర్నమెంట్ పట్టించుకోలేదు. దీంతో టీడీపీ అధినేత చంద్రబాబు తాము అధికారంలోకి వస్తే.. తప్పుకుండా టీటీడీని ప్రక్షాళన చేస్తామని ఇటీవల జరిగిన ఎన్నికల ప్రచారంలో పదేపదే చెప్పారు. చెప్పినట్లుగానే తెలుగుదేశంపార్టీ అధికారంలోకి రావడంతో చంద్రబాబు టీటీడీలో ప్రక్షాళనను ప్రారంభించారు.
తాజాగా గురువారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు టీటీడీని ప్రక్షాళన చేస్తామని చెప్పారు. ఈ మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం కొత్త ఈవోగా జె. శ్యామలారావును నియమించారు. గత టీటీడీ ఈవో ధర్మారెడ్డి ఏడు రోజుల పాటు శెలవులు పెట్టడంతో.. ఈవో బాధ్యతలను దేవస్థానం అధికారుల జేఈవో వీరబ్రహ్మానికి అప్పగించారు.అయితే ఇంతలోనే తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా జే.శ్యామలరావును ప్రభుత్వం నియమించి ధర్మారెడ్డికి షాక్ ఇచ్చింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ