ఏపీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన..టీడీపీ,జనసేన,బీజేపీ కూటమి ఇప్పటికే సీఎం, మంత్రివర్గం ప్రమాణస్వీకార కార్యక్రమాలు పూర్తి చేసింది. అలాగే మంత్రులకు శాఖల కేటాయింపును కూడా పూర్తి చేసింది. అయితే ఇప్పుడు స్పీకర్ ఎన్నికపై అధికారపక్షం కసరత్తు చేస్తోంది . స్పీకర్ పేరును దాదాపు ఎంపిక చేసినట్లే వార్తలు వినిపిస్తున్నాయి.
స్పీకర్‌గా టీడీపీ సీనియర్ నాయకుడు, ఎమ్మెల్యే చింతకాయల అయ్యన్నపాత్రుడుని ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. అలాగే, డిప్యూటీ స్పీకర్ పదవి జనసేన ఎమ్మెల్యేకు దక్కే అవకాశం ఉంది. పదవి కోసం జనసేన ఎమ్మెల్యే లోకం మాధవి పేరును సీఎం చంద్రబాబు పరిశీలిస్తున్నారు. అలాగే ప్రభుత్వ చీఫ్ విప్‌గా ధూళిపాళ్ల నరేంద్రను నియమించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. త్వరలోనే ఈ పదవులపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది.
మరోవైపు జూన్ నెల 19 న ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతుండటంతో…అదే రోజు ఎమ్మెల్యేలంతా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఎమ్మెల్యేలతో ప్రమాణ స్వీకారం చేయించడానికి సభలో ఉన్న ఒక సీనియర్ ఎమ్మెల్యేను ప్రోటెం స్పీకర్‌గా ఎన్నుకుంటారు. ఆ తర్వాత స్పీకర్, డిప్యూటీ స్పీకర్‌ను కూడా సభ్యులు ఎన్నుకుంటారు.
అయితే ఏపీ స్పీకర్‌గా బీసీ నేతను ఎంపిక చేస్తే బాగుంటుందని సీఎం చంద్రబాబు నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, నర్సీపట్నం ఎమ్మెల్యే అయిన అయ్యన్నపాత్రుడు పేరును స్పీకర్ పదవికి ఖరారు చేసినట్లు తెలుస్తోంది. దీనికి తోడు అయ్యన్నపాత్రుడు డిప్యూటీ సీఎం పదవిని ఆశించినా అది జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు ఇచ్చారు.అందుకే స్పీకర్ రేసులో అయ్యన్నపాత్రుడు, నక్కా ఆనందబాబు, కళా వెంకట్రావు పేర్లు ముందుగా వినిపించినా. ఐదేళ్లుగా పార్టీ కోసం ఆయన చేసిన సేవలను కూడా గుర్తుంచుకొని అయ్యన్నపాత్రుడు వైపే మొగ్గు చూపినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE