తెలంగాణలో రాజకీయాలు ఊహించని మలుపు తిరుగుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిని చవిచూసినప్పటి నుంచి బీఆర్ఎస్ పార్టీ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క స్థానాన్ని కూడా బీఆర్ఎస్ దక్కించుకోలేకపోయింది. అంటే ప్రస్తుతం బీఆర్ఎస్ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈకష్టం సమయంలో ఒక్కొక్కరుగా ఆ పార్టీ నేతలు బీఆర్ఎస్‌ను వీడుతున్నారు. ఇప్పటికే కొందరు నేతలు బీఆర్ఎస్‌కు గుడ్ బై చెప్పి అధికార కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. ఇప్పుడు మరో కీలక నేత, కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడు అయిన నేత కూడా బీఆర్ఎస్‌కు గుడ్ బై చెప్పారు. కాంగ్రెస్ గూటికి చేరారు. ఆయనే తెలంగాణ అసెంబ్లీ మాజీ స్పీకర్, బీఆర్ఎస్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస రెడ్డి.
శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో శ్రీనివాస రెడ్డి కాంగ్రెస్‌లో చరారు. రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి శుక్రవారం పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇంటికి వెళ్లారు. ఆయనత చర్చలు జరిపి.. పోచారంను కాంగ్రెస్‌లోకి ఆహ్వానించారు. దీంతో శ్రీనివాస్ రెడ్డి కూడా కాంగ్రెస్‌లో చేరేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వెంటనే తన కుమారుడు భాస్కర్ రెడ్డితో కలిసి శ్రీనివాస్ రెడ్డి.. రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే ఎవరూ ఊహించని విధంగా పోచారం శ్రీనివాస్ రెడ్డి కారు దిగి.. కాంగ్రెస్ గూటికి చేరడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది.
1994లో జరిగిన ఎన్నికల్లో బాన్సువాడ నుంచి తొలిసారి టీడీపీ తరుపున పోచారం శ్రీనివాస్ రెడ్డి పోటీ చేసి గెలుపొందారు. ఆతర్వాత 1999లోనూ గెలుపొంది రెండోసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. 204లో మరోసారి పోటీ చేసినప్పటికీ కాంగ్రెస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్థన్ రెడ్డి చేతిలో ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత 2009లో మరోసారి టీడీపీ నుంచి పోటీ చేసి గెలుపొందారు. 2011లో తెలంగాణ ఉద్యమానికి మద్ధతు ఇచ్చి బీఆర్ఎస్ ( అప్పటి టీఆర్ఎస్) పార్టీలో చేరారు. అప్పటి నుంచి బీఆర్ఎస్ పార్టీ తరుపున వరుసగా 2014, 218, 2023లో ఎమ్మెల్యేగా గెలుపొందారు.
తెలంగాణలో తొలిసారి బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక.. కేసీఆర్ కేబినెట్‌లో వ్యవసాయ శాఖ మంత్రిగా పోచారం శ్రీనివాస్ రెడ్డి పనిచేశారు. రెండోసారి బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక అసెంబ్లీ స్పీకర్‌గా పనిచేశారు. 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి బీఆర్ఎస్ తరుపున బాన్సువాడ నుంచి పోటీ చేశారు. 23 వేల పైచిలుకు ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ముందు నుంచి కూడా కేసీఆర్‌తో శ్రీనివాస రెడ్డి సన్నిహితంగా మెలిగే వారు. గతంలో పలుమార్లు పోయారంపై కేసీఆర్ ప్రశంసలు కురిపించారు. పోచారంలో ఎక్కడ అడుగుపెట్టినా లక్ష్మీ తాండవించినట్టుగా పని జరిగేదని.. ఏ పని మొదలుపెట్టినా శుభప్రదం అయ్యేదని కేసీఆర్ ఓ సందర్భంలో వ్యాఖ్యానించారు. పోచారం శ్రీనివాస్ రెడ్డికి తాను లక్ష్మీపుత్రుడు అని పేరు పెట్టానని చెప్పుకొచ్చారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY